ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసు, ఆటో పార్ట్శ్ డీలర్ మాన్ శుఖ్ హిరేన్ మృతి కేసులో ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని ప్రశ్నిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు షాక్ తిన్నారు. ముంబైలోని బాంద్రా నదిలో ఓ హార్డ్ డిస్క్ ను, మునిగిపోయిన కారు నెంబర్ ప్లేట్లను వారు కనుగొనడమే ఇందుకు కారణం. తమ కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం వారు గజ ఈతగాళ్లను రప్పించి ఈ నదిలో గాలింపునకు ఆదేశించారు. ఈ డైవర్లు సుమారు గంట సేపు సెర్చ్ చేయగా ఇవి బయటపడ్డాయి. (ఏప్రిల్ 3 వరకు వాజే ఈ సంస్థ కస్టడీలో ఉన్నారు). ఈ కేసుల్లో తన ప్రమేయం లేకుండా చూసేందుకు వాజే సాక్ష్యాధారాలను మాయం చేయడానికి యత్నించి ఉండవచ్చునని మొదట ఎన్ఐఎ అధికారులు భావించినట్టు తెలుస్తోంది. పైగా ఇతని ఇంటిలో 62 బులెట్లను కూడా వారు ఇటీవల కనుగొన్నారు.
ఇలా ఉండగా మార్చ్ 3 న తాను ‘వీక్లీ మామూలు’ ఇచ్చేందుకు సచిన్ వాజే కార్యాలయానికి వెళ్లగా ఆ రోజున తనకు మాన్ సుఖ్ హిరేన్ కనబడ్డాడని ఓ హోటల్ యజమాని ఎన్ఐఏ సిబ్బందికి తెలిపాడు. ఆ రోజున తాను అరెస్టయిన వినాయక్ షిండేను, మరికొందరిని కూడా చూశానని, ముఖ్యంగా హిరేన్ అప్పుడు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడని ఆ హోటల్ యజమాని చెప్పాడు. వారి మధ్య సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటలవరకు రహస్య సమావేశం జరిగినట్టు ఆయన పేర్కొన్నాడు. పైగా హిరేన్ మృతికి రెండు రోజుల ముందు ఓ పోలీసు అధికారి సెలవు పెట్టినట్టు కూడా తెలిసింది. సాధారణంగా వీరు నాలుగు రోజులముందు సెలవు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ అధికారి రెండు రోజుల ముందే లీవ్ తీసుకోవడం కూడా దర్యాప్తు సంస్థ అధికారుల దృష్టికి వచ్చింది. అంబానీ బాంబు కేసుకు బాధ్యత వహించాల్సిందిగా హిరేన్ ను వాజే బలవంత పెట్టాడని, కానీ ఇందుకు హిరేన్ నిరాకరించాడని అధికారులు కనుగొన్నారు. మార్చ్ 4 న హిరేన్ మృత దేహాన్ని థానేలో కనుగొన్నారు.
#WATCH | Maharashtra: Divers of NIA recover computer CPUs, two number plates carrying the same registration number, and other items from Mithi river in Mumbai’s Bandra Kurla Complex as the agency probes the death of Mansukh Hiren.
Accused Sachin Waze is also present at the spot pic.twitter.com/RXq2d4cCMP
— ANI (@ANI) March 28, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్ అయిన కరుడుగట్టిన నేరగాడు
IND vs ENG 3rd ODI: దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 330 పరుగులు..