PM Modi: ఏనుగుకు ప్రాణం పోసిన అటవీ సిబ్బంది.. సంతోషంగా ఉందంటూ ప్రధాని మోడీ ప్రశంసలు..

|

Feb 18, 2023 | 3:01 PM

కర్నాటకలోని బండిపుర టైగర్‌ రిజర్వ్‌ సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. కరెంట్‌ షాక్‌ తగిలి విలవిలలాడుతున్న గజరాజు ప్రాణాలను అటవీశాఖ సిబ్బంది కాపాడారు.

PM Modi: ఏనుగుకు ప్రాణం పోసిన అటవీ సిబ్బంది.. సంతోషంగా ఉందంటూ ప్రధాని మోడీ ప్రశంసలు..
Pm Modi
Follow us on

కర్నాటకలోని బండిపుర టైగర్‌ రిజర్వ్‌ సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. కరెంట్‌ షాక్‌ తగిలి విలవిలలాడుతున్న గజరాజు ప్రాణాలను అటవీశాఖ సిబ్బంది కాపాడారు. తగిన సమయంలో ఆ ఏనుగును ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. దీంతో ఆ గజరాజు చాలా వేగంగా కోలుకుంది. అయితే, కరెంట్‌ షాక్‌ నుంచి కోలుకున్న ఏనుగును తిరిగి బండిపుర టైగర్‌ రిజర్వ్‌లో వదిలారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గజరాజు ప్రాణాలు కాపాడిన సిబ్బందిని అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, ఈ ఘటనపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. సమయస్పూర్తితో ఏనుగు ప్రాణాలను కాపాడారు అంటూ అటవీ సిబ్బందిని కొనియాడుతున్నారు.

వివరాల ప్రకారం.. తాజాగా కర్ణాటక బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఓ ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురై.. విలవిల్లాడింది. అనంతరం అది అపస్మారక స్థితికి చేరుకోగా.. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది దానికి సకాలంలో చికిత్స చేశారు. దీంతో స్పృహలోకి వచ్చిన ఆ గజరాణి.. మెల్లగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ వీడియోలను కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విద్యుదాఘాతానికి గురై ప్రాణాలతో పోరాడిన ఏనుగును బందిపూర్ టైగర్ రిజర్వ్ సిబ్బంది కాపాడారని.. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టినట్లు భూపేందర్‌ యాదవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

పీఎం మోడీ ట్వీట్..

కాగా, ఈ ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ‘ఇదంతా చూడటం చాలా సంతోషంగా ఉంది. సిబ్బందికి అభినందనలు. ప్రజల్లో ఇలాంటి దయాగుణం మెచ్చుకోదగినది’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

ఇదిలాఉంటే.. నెటిజన్లు సైతం అటవీశాఖ సిబ్బందిని ప్రశంసిస్తూ ట్విట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల పరిరక్షణలో మీ కృషి వెలలేనిది అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..