Viral: ఓ ఫ్లాట్‌ నుంచి అదో మాదిరి వాసన.. అనుమానమొచ్చి చుట్టుప్రక్కల వారు వెళ్లి చూడగా

ఓ ఫ్లాట్‌లో ఘాటైన వాసన గుప్పుమంది. ఇరుగుపొరుగు వాళ్లు ఆ వాసన తట్టుకోలేకపోయారు. ఈలోగా సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడగా.. లోపల కనిపించింది ఏంటంటే.? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

Viral: ఓ ఫ్లాట్‌ నుంచి అదో మాదిరి వాసన.. అనుమానమొచ్చి చుట్టుప్రక్కల వారు వెళ్లి చూడగా
Representative Image

Edited By:

Updated on: Oct 01, 2025 | 9:07 AM

గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిల్లీనియం సిటీ సొసైటీ ప్రాంతంలో ఓ భర్త భార్యను చంపేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె మెడకు చున్నీ కట్టి చంపగా.. దానికి గల కారణం తెలిస్తే మీరూ షాక్ అవుతారు. చనిపోయే ముందు అతడు తన స్నేహితుడికి ఒక వీడియో పంపించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో చూసిన స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఫ్లాట్ తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య మృతదేహం నేలపై పడి ఉండగా భర్త ఉరేసుకుని కనిపించాడు.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్‌కు చెందిన స్వీటీ శర్మ(28)తో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అజయ్ కుమార్ (30) వివాహం మూడేళ్ల క్రితం జరిగింది. అజయ్, స్వీటీ ఇద్దరూ గురుగ్రామ్‌లోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య వర్క్ ఫ్రమ్ హోమ్‌ నుంచి పని చేస్తోంది. ఇద్దరూ కూడా గత రెండేళ్ల నుంచి సెక్టార్ 37Dలోని మిల్లీనియం వన్ సొసైటీ టవర్ 7లో నివాసముంటున్నారు. అజయ్ తన స్నేహితుడికి ఇప్పటికే భార్యతో తరచూ తగాదాలు జరుగుతున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తగాదాకు అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు