జామియా వద్ద గన్ షాట్.. నిందితునికి యావజ్జీవ జైలు శిక్ష ?

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నవారిపై గన్ తో కాల్పులు జరిపిన వ్యక్తిని గ్రేటర్ నోయిడాకు చెందిన జవార్ గా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి విదితమే.. సవరించిన ఆయుధ చట్టం కింద అతడిని విచారించనున్నారు. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు అతనికి యావజ్జీవ జైలుశిక్ష విధించవచ్ఛునని తెలుస్తోంది. ఆ యువకుడు ఎలా గన్ సంపాదించాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కాల్పుల ఘటనలో […]

జామియా వద్ద గన్ షాట్.. నిందితునికి యావజ్జీవ జైలు శిక్ష ?

Edited By:

Updated on: Jan 31, 2020 | 4:44 PM

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నవారిపై గన్ తో కాల్పులు జరిపిన వ్యక్తిని గ్రేటర్ నోయిడాకు చెందిన జవార్ గా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి విదితమే.. సవరించిన ఆయుధ చట్టం కింద అతడిని విచారించనున్నారు. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు అతనికి యావజ్జీవ జైలుశిక్ష విధించవచ్ఛునని తెలుస్తోంది. ఆ యువకుడు ఎలా గన్ సంపాదించాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అలాగే ఈ కాల్పుల ఘటనలో అతనికి ఎవరైనా సహకరించారా అన్న విషయాన్ని కూడా కూపీ లాగుతున్నారు. ఇతనికి బజరంగ్ దళ్ తో సంబంధం ఉన్నట్టు తెలిసింది. దాడికి ముందు తన ఫేస్ బుక్ లో.. ‘ షాహీన్ బాగ్.. ఖేల్ ఖతం ! ‘ అని జవార్ కామెంట్ రాసుకున్నాడట. అలాగే….  ‘ నా చివరి ప్రయాణంలో జై శ్రీరామ్ అనే నినాదాలతో రాసి ఉన్న ఓ కాషాయ వస్త్రాన్ని నా శరీరంపై కప్పండి’ అని కూడా పేర్కొన్నాడట.  అంటే తన ప్రాణాలకు కూడా ఇతగాడు తెగించి కాల్పుల ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు-ఇతని కాల్పుల్లో ఎడమ చేతికి గాయమైన విద్యార్థిని షాహబ్ ఫరూఖ్ గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us