Amit Shah: వారు మోడీ, బీజేపీకి క్షమాపణ చెప్పాలి.. హోం మంత్రి అమిత్ షా డిమాండ్

|

Jun 25, 2022 | 3:27 PM

Gujarat riots 2002: గుజరాత్ అల్లర్ల విషయంలో నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీ(Narendra Modi)కి సిట్ క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హోం మంత్రి అమిత్ షా స్వాగతించారు.

Amit Shah: వారు మోడీ, బీజేపీకి క్షమాపణ చెప్పాలి.. హోం మంత్రి అమిత్ షా డిమాండ్
Home Minister Amit Shah (File Photo)
Follow us on

Gujarat riots 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీ(Narendra Modi) సహా 62 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారంనాడు కొట్టివేయడం తెలిసిందే. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah). నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై ‘రాజకీయ ప్రేరేపిత’ ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు తీర్పుపై అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు.  ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాన్న విషయంలో నరేంద్ర మోడీ ఇతర రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. 2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీ స్వయంగా దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నాడు సిట్ విచారణకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేయలేదని.. మోడీకి సంఘీభావంగా దేశ నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తల సమీకరణ చేయలేదన్నారు. చట్టానికి తాము పూర్తిగా సహకరించామని అన్నారు. తాను కూడా అరెస్టు అయ్యానని గుర్తుచేసిన అమిత్ షా.. దీని పట్ల తాను ఆందోళనకు దిగలేదన్నారు. ఈడీ కేసులో రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత విజయం సాధించి నిజం బయటకు వస్తే.. అది పసిడి కంటే ప్రకాశవంతంగా ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీపై ఆరోపణలు చేసిన వారికి ఏ మాత్రం ఆత్మపరిశీలన ఉన్నా.. మోడీతో పాటు బీజేపీకి వారు క్షమాపణ చెప్పాలని అన్నారు.

గుజరాత్ అల్లర్లలో నాటి సీఎం నరేంద్ర మోడీతో సహా 62 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికను సమర్థిస్తూ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గతంలో జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..