Municipal Corporation General Elections: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు నగరాల్లో ఈ నెల 21 మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు హామీల వర్షం కురిపించింది. ఆయా నగరాల్లో ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేస్తామని, వాహనాల పార్కింగ్‌కు సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. దీంతోపాటు ఆస్తి పన్నులో రాయితీలు కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా కాంగ్రెస్ మేనిపెస్టోను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చావ్డా మాట్లాడుతూ.. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ నగరాల్లో బీజేపీనే అధికారంలో ఉందని.. ఆపార్టీ ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే.. నగరాల్లోని రోడ్లపై కాలుష్యం నివారణకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించింది. కరోనా లాక్డౌన్ సమయంలో వర్తకులకు పన్ను రాయితీలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేకాకుండా నగరాల్లో ఉచిత వైఫై జోన్లు, ఉచిత పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. మునిసిపాలిటీ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని కాంగ్రెస్ మేనిపెస్టోలో వివరించింది. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని తెలిపింది.
Also Read: