
ఆ దంపతులకు ఓ కుమార్తె.. పేదరికంలో మగ్గుతున్నారు.. ఈ క్రమంలో ఏదైనా పనిచేసుకుని బతుకుదామని ఊరు కాని ఊరు వెళ్లారు.. రూ.2వేలకు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఏమైందో ఏమో కానీ, అద్దె చెల్లించేందుకు ఆ కుటుంబం దగ్గర డబ్బుల్లేవు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. నాలుగు నెలలుగా అద్దె బకాయి ఉంది.. దీంతో ఆ ఇంటి యజమాని గొడవ చేయడం మొదలుపెట్టాడు.. ఏం చేయాలో అర్థం కాక మనోవేదనకు లోనయ్యాడు. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేక ఆ వ్యక్తి తన భార్య, మైనర్ కుమార్తెను ఇంటి యజమాని దగ్గరకు పంపేలా అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆ ఇంటి యజమాని.. అటు తల్లి .. ఇటు కూతురిపై వరుసగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం సుమారు 6 నెలల క్రితం మోర్బికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ.2వేలు అద్దెతో వారు ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే.. మొదట్లో అద్దె చెల్లించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించలేకపోయారు.
దీంతో ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని గొడవ చేశాడు.. అయితే, తాను అద్దె చెల్లించలేనని దానికి బదులుగా తన భార్య, మైనర్ కుమార్తెను పంపిస్తానని ఆ వ్యక్తి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు.. ఆ తర్వాత.. ఆ ఇంటి యజమాని తల్లీ కుమార్తెలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ.. ఈ విషయం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తితోపాటు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందని.. పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..