Hardik Patel: హిందువులపై ఇంత ద్వేషం ఎందుకు? కాంగ్రెస్‌ను ప్రశ్నించిన హార్దిక్ పటేల్..

|

May 24, 2022 | 6:34 PM

Gujarat Election 2022:కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పనిచేస్తోందన్నారు. హిందూమత విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని సామాజిక కార్యకర్త హార్దిక్ పటేల్ విమర్శించారు.

Hardik Patel: హిందువులపై ఇంత ద్వేషం ఎందుకు? కాంగ్రెస్‌ను ప్రశ్నించిన హార్దిక్ పటేల్..
Hardik Patel
Follow us on

కాంగ్రెస్ పార్టీని(Congress)ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త హార్దిక్ పటేల్. ఈ మధ్య ఆ పార్టీని వీడిన హార్దిక్.. వరుస విమర్శలతో దూకుడుమీదున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భరత్ సింగ్ సోలంకీ  రామాలయంపై చేసిన ప్రకటనపై మండిపడ్డారు. ఆయన హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీశారని హార్దిక్ పటేల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పనిచేస్తోందన్నారు. హిందూమత విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని గతంలోకూడా తాను చెప్పానని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “శ్రీరాముడితో మీకు శత్రుత్వం ఏంటని నేను కాంగ్రెస్‌ని, ఆ పార్టీ నేతలను అడగాలనుకుంటున్నాను అని హార్దిక్ పటేల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.” హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తారు? శతాబ్దాల తర్వాత, అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారు అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు శ్రీరాముడికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.” అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు 

గుజరాత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్ పటేల్ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం నిరసన రాజకీయాలకు మాత్రమే పరిమితమైందని పటేల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే దేశానికి ప్రత్యామ్నాయం కావాలి.. దేశానికి వారి భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రత్యామ్నాయం అవసరమని.. మన దేశ ప్రజలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం అవసరమన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతన్ శివిర్ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన రెండో పెద్ద నేత హార్దిక్ పటేల్. ఇటీవల రాహుల్ గాంధీని హార్దిక్ లేఖ కలిశారు. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమనేతగా ఉన్న హార్దిక్ పటేల్ గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేయడంతో పాటు ఆ పార్టీ నాయకత్వంపై కూడా ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో బీజేపీని నిరంతరం పొగుడుతూనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో బిజెపిలో అతని ఎంట్రీపై ఊహాగానాలు వినిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బిజెపి నాయకుడిని కలవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి.