Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి ఎలా ఉందంటే..

గత వారం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది.

Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి ఎలా ఉందంటే..
Group Captain Varun Singh

Updated on: Dec 14, 2021 | 9:55 PM

Helicopter Crash: గత వారం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మంగళవారం తెలిపారు. ఆయన ప్రస్తుతం బెంగుళూరు కమాండ్ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ క్షేమం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది.

గ్రూప్ కెప్టెన్ తల్లిదండ్రులు కూడా బెంగళూరులోనే ఉన్నారు

గత వారం డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, గ్రూప్ కెప్టెన్ తల్లిదండ్రులు కూడా బెంగళూరులోనే ఉన్నారు. శనివారం నాడు తన కొడుకుని ఐసీయూలోంచి చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయని, అయినా తనే ధైర్యం తెచ్చుకుని నా కొడుకు యోధుడు, ఈ పోరాటంలో కూడా గెలిచి తిరిగొస్తానని చెప్పాడు అని అయన తండ్రి అంటున్నారు.

గత ఏడాది ప్రారంభంలో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తేజస్ విమానం టెస్ట్ ఫ్లైట్ సమయంలో పెద్ద సాంకేతిక లోపం ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితిలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అతను తృటిలో తప్పించుకోగలిగాడు. అతని ధైర్యసాహసాలకు ఈ సంవత్సరం శౌర్య చక్ర అవార్డు లభించింది.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ డియోరియా నివాసి

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా రుద్రపూర్ తహసీల్‌లోని కన్హోలి గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం వరుణ్ సింగ్ భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్‌గా ఉన్నారు. తమిళనాడులోని వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)కి డైరెక్టింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కెపి సింగ్ కూడా ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. అయితే ప్రస్తుతం అతని కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నివసిస్తోంది.

అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కెప్టెన్ వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా సహాయం చేసేందుకు దేశం సిద్ధంగా ఉందని వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు రక్షణ మంత్రి తెలిపారు. అదే సమయంలో వరుణ్‌సింగ్‌కు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 8న కన్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11 మంది రక్షణ సిబ్బంది మరణించారు. కాగా ఈ ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి: Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!

Chardham Road Project: సైనికుల కోసం ఇది తప్పనిసరి.. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు ఆమోదం