స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్ అరెస్టుకు లోకల్ కోర్టు అనుమతించింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను...

స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Oct 21, 2020 | 4:56 PM

Green signal for Supnasuresh arrest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్ అరెస్టుకు లోకల్ కోర్టు అనుమతించింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్టు చేసి విచారించవచ్చని ఆర్థిక నేరాల అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. స్వప్నా సురేశ్‌తోపాటు సరిత్ పీఎస్‌ను అదుపులోకి తీసుకుని గోల్డ్ స్మగ్లింగ్, డాలర్ స్మగ్లింగ్ కేసుల్లో విచారణ కొనసాగించవచ్చని కస్టమ్స్ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కస్టమ్స్ అధికారుల అభియోగాల ప్రకారం స్వప్నా సురేశ్..  లక్షా 90 వేల డాలర్లను కేరళ నుంచి విదేశాలకు అక్రమంగా స్మగుల్ చేసింది. తాను పని చేసే యూఏఈ కాన్సులేట్ ఐడీ కార్డును వాడుకుని ఆమె ఈ స్మగ్లింగ్‌కు పాల్పడిందని కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడిన స్వప్నా సురేశ్‌ను విచారిస్తున్న సమయంలో డాలర్ల స్మగ్లింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ స్మగ్లింగ్ దందాలపై కస్టమ్స్ శాఖతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ బంగారం స్మగ్లింగ్ దందా జులై అయిదో తేదీన తిరువనంతపురంలో ఎయిర్‌పోర్టు కార్గోలో 14.82 కోట్ల రూపాయల విలువ చేసే 30 కిలోల బంగారాన్ని సీజ్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆనాటి నుంచి దర్యాప్తులో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డాలర్ల స్మగ్లింగ్ వ్యవహారం కూడా దర్యాప్తు పరిధిలోకి చేరింది.

Also read: అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్