Central Govt: కొత్త వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త కార్లలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేసినట్లు స్పష్టం చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌లో కొత్త నిబంధనలను వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం.. 2021 ఏప్రిల్ 1 నుంచి అన్ని కొత్త వాహనాల(కార్లు)కు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు కలిగి ఉండాలంది. ‘‘వాహనం ముందు సీటులో, డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి.
ఇది ముఖ్యమైన భద్రతా లక్షణంగా తప్పనిసరి చేయబడింది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఉన్న వాహనాలను 2021 ఆగస్టు 31 నుంచి డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో విక్రయించాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Central Government Tweet:
Ministry has issued Gazette notification regarding mandatory provision of an airbag for passenger seated on front seat of a vehicle, next to driver. This has been mandated as an important safety feature & is also based on suggestions of Supreme Court Committee
on Road Safety pic.twitter.com/JALS5rzHmG— PIBIndiaMoRTH (@PIBMoRTH) March 5, 2021
Also read: