హైవేపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. ఇక మీ ప్రయాణం సాఫీగా..

| Edited By:

Jan 08, 2020 | 5:20 AM

ఇక నేషనల్ హైవేలపై వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో.. ప్రయాణీకులకు ఎంతో టైం సేవ్ అవుతోంది. టోల్ ఫీజు కట్టాలంటే కనీసం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంగా వాహనాలు బారులు తీరితే.. మరింత ఎక్కువ సమయం పడుతుంది. ఈ క్రమంలో అక్కడ విపరీతమైన స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర […]

హైవేపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. ఇక మీ ప్రయాణం సాఫీగా..
Follow us on

ఇక నేషనల్ హైవేలపై వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో.. ప్రయాణీకులకు ఎంతో టైం సేవ్ అవుతోంది. టోల్ ఫీజు కట్టాలంటే కనీసం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంగా వాహనాలు బారులు తీరితే.. మరింత ఎక్కువ సమయం పడుతుంది.

ఈ క్రమంలో అక్కడ విపరీతమైన స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద ఈ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టింది నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా. వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేందుకు.. నేషనల్ హైవేలపై ఉన్న అన్ని స్పీడ్‌బ్రేకర్లను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్‌ స్టార్ట్ చేసింది. టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ పనితీరు బాగుండటంతో.. అక్కడ ఉండే స్పీడ్ బ్రేకర్లను.. రంబుల్‌ స్ట్రిప్స్‌ను తొలగిస్తున్నామని.. రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటి ద్వారా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని.. అంతేగాక, వాహనాలు త్వరగా పాడవడం, ఇంధన వినియోగం కూడా పెరగడం జరుగుతున్నాయని.. మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, నిబంధనలకు లోబడే ఈ స్పీడ్‌ బ్రేకర్లను తొలగింపు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.