Mystery Iland: భూమి వయసు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. కాలంతో పాటు అనేక మార్పులు చోటు చేసుకున్నాయని .. అనేక విషయాల ద్వారా మనకు తెలుస్తుంది. కొన్ని నగరాలు సముద్రంలో కలిసిపోయాయని అందుకు ద్వారక ఉదాహరణ అని పరిశోధకులు చెబుతూనే ఉన్నారు, ఇప్పుడు మరికొన్ని నగరాలు కాలక్రమంలో సముద్రంలో కలిసిపోతాయని ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరబియా సముద్రంలో ఒక కొత్త దీవి కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
కేరళ సమీపంలో అరేబియా సముద్రంలో సరికొత్త దీవి నేను ఉన్నా అంటూ ప్రత్యక్షమైంది. తాజాగా గూగుల్ మ్యాప్స్ లో కనిపించి ఈ ద్వీపం వెలుగులోకి వచ్చింది.కొచ్చి తీరానికి ఇది కేవలం 7 కిమీ దూరంలోనే ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ ద్వీపం సరిగ్గా ఎవరికి కనిపించక పోవడంతో దీని గురించి స్థానికులకు ఇప్పటి వరకూ పెద్దగా అంచనాలేదు.. అయితే ఇప్పటి వరకూ లేని ఈ ద్వీపం ఇపుడు ఎలా వచ్చిందని సామాన్యులు ఆలోచిస్తుంటే.. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ దీవి చిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తుంది. అనేకాదు గూగుల్ మ్యాప్ లో కనిపించిన బొమ్మ ఆధారంగా ఈద్వీపం సుమారు 8 కిమీ పొడవు, 3 కిమీ వెడల్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దీవికి సంబందించిన ఫోటోను ఓ పర్యాటక సంస్థ అధ్యక్షుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రభుతం సహా అందరి దృష్టి దీని మీదపడింది. ఈ రహస్య దీవి గురించి అధ్యయనం చేయడానికి కేరళ సర్కార్ ముందుకొచ్చింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఈ దీవి గురించి స్పందిస్తూ.. సముద్ర తీర ప్రాంతం ఎక్కువ కాలం కోతకు గురై నప్పుడు ఇటువంటి దీవులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కొత్త దీవి రహస్యాన్ని శాస్త్రజ్ఞులు కనిపెట్టే పనిలో ఉన్నారు.
Also Read: పుల్లపుల్లగా రుచికరమైన చింతచిగురు కారం తయారీ విధానం
ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యం.. ఒక్క చీమ కూడా కనిపించని క్షేత్రం..