Good news for regular EMI payers: లాక్‌డౌన్ కాలంలో కేంద్రమిచ్చిన మారటోరియంను వినియోగించుకోకుండా నెలవారీ కిస్తులను ( వివిధ రుణాల ఈఎంఐలు) రెగ్యులర్‌గా చెల్లించిన వారికి మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించబోతోంది. రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై బహిరంగ ప్రకటన చేయడమొక్కటే మిగిలినట్లు సమాచారం. దసరా-దీపావళి మధ్య కాలంలో ఈ శుభవార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి గానీ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులుగానీ ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి నెలాఖరులో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు దేశంలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్యాలు మూతపడ్డాయి. దాంతో వేతన జీవులతోపాటు వ్యాపరస్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. వీరి ఇబ్బందులను పరిగణలోని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల రుణాలకు సంబంధించిన నెలవారీ కిస్తులు (ఈఎంఐలు) చెల్లించడం నుంచి వెసులుబాటు ఇస్తూ మారటోరియం ప్రకటించింది.
డబ్బులు అడ్జస్ట్ అయిన వారు ఈ మారటోరియం నుంచి వినియోగించుకోకుండా రెగ్యులర్‌గా కిస్తులను చెల్లించారు. మరికొంతరు మారటోరియంను వినియోగించుకున్నారు. అత్యంత కష్ట కాలంలోను కిస్తులను క్రమంగా చెల్లించిన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వుంది. అందుకే రెగ్యులర్‌గా కిస్తులను చెల్లించిన వారికి కొంతైనా వడ్డీ మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన దసరా-దీపావళి మధ్య కాలంలో వెలువడే అవకాశం వుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలంపాటు అమలు చేసే అవకాశం వుంది.
Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్
Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్