బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రోజుకో కొత్త మార్గంలో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అధికారులే కంగుతినేలా వినూత్న రీతిలో బంగారాన్ని దాచి దేశాలు దాటిస్తున్నారు. మరో వైపు అధికార యంత్రాంగం సైతం అదే స్థాయిలో నిఘా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ బంగారం అక్రమ రవాణాను బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో భారీగా బంగారం పట్టుబడింది.. రెండు వేర్వేరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.27 కోట్ల విలువైన 45 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈ మేరకు రెండు ఘటనల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చెన్నై విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు ఓ సిబ్బంది నుంచి 13 కేజీల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు, విమానాశ్రయ సిబ్బంది, ట్రాన్సిట్ ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేస్తున్న మహ్మద్ బర్కతుల్లా అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్‌తో చెన్నై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అతడి వద్ద నుంచి ఎయిర్‌పోర్టు డిపార్చర్ గేట్ వద్ద సోదాలు నిర్వహించి రబ్బర్ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి పేస్ట్ రూపంలో ఉన్న 36 పౌచులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.8.04 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
On June 10, based on profiling, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized 32.79 Kgs of Gold valued at Rs. 19.15 Cr across 02 cases. Gold was found concealed in undergarments and baggage of two lady passengers of foreign nationality. Both the pax were arrested. pic.twitter.com/wY7mnFBDxO
— Mumbai Customs-III (@mumbaicus3) June 10, 2024
అటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల వద్ద నుంచి 32.79 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తులు, బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.19.15 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు ముంబై కస్టమ్స్ అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..