Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజి స్కాన్ చేస్తుండగా కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా

ఎయిర్ పోర్టులో లగేజి చెక్ చేస్తుండగా.. ఓ వ్యక్తికి షాక్ తగిలింది. తనకు తెలియని బ్యాగ్.. తన లగేజిలో కలిసింది. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజి స్కాన్ చేస్తుండగా కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
Bag Scanner At Airport

Updated on: Jul 28, 2025 | 12:33 PM

బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ప్యాసింజర్ బ్యాగులో ఏకంగా 3.5 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు పోలీసులు. సదరు యజమాని లగేజి స్కాన్ చేయించడానికి ట్రాలీపై బ్యాగులు సర్దుతుండగా.. ఓ అనుమానస్పద బ్యాగు.. అతడి లగేజి నుంచి కిందపడింది. తనకు సంబంధించిన బ్యాగ్ కాకపోవడంతో.. ఓపెన్ చేసి చూడగా.. అందులో 3.5 కిలోల బంగారు బిస్కెట్లు కనిపించాయి.

దీంతో ఆ బ్యాగ్‌ను డీఆర్ఐ అధికారులు అందించాడు సదరు వ్యక్తి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ బ్యాగ్ తన లగేజిలో పడేశాడని చెప్పుకొచ్చాడు. ఈ బంగారంపై అధికారులు సదరు వ్యక్తిని పలు ప్రశ్నలు ప్రశ్నించగా.. తనకు ఈ బంగారంతో ఎలాంటి సంబంధం లేదని.. ఇందులో తనను కావాలనే ఇరికిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రస్తుతం CCTV ఫుటేజ్ ఆధారంగా స్మగ్లర్ కోసం వెతుకులాట ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.