స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బంగారు నగలు విత్‌డ్రా చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక జంటకు అనుకోని ఘటన ఎదురైంది. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రూ. 20 వడ పావ్ కోసం ఆగితే రూ.5 లక్షలు రూపాయల బంగారు నగలను ఎత్తుకెళ్లారు దుండగుడు.
పూణేకు చెందిన దశరథ్, జయశ్రీ దంపతులు బ్యాంకులో దాచిన బంగారు నగలను తీసుకుని ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో వడ పావ్ స్టాల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. వారి దృష్టి మరల్చిన దుండగుడు, వారి స్కూటర్ దగ్గరకు వచ్చి డిక్కీలో ఉంచిన బ్యాగ్‌ను దొంగిలించాడు. అతడిని గమనించిన దంపతులు సహాయం కోసం కేకలు వేయగా, అప్పటికే దొంగ పారిపోయాడు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Pune Couple Stops for Vada Pav, Loses Rs 5 Lakh Worth of Jewellery to Thief. 😭 pic.twitter.com/S48ZGL8fJE
— Satyaagrah (@satyaagrahindia) August 31, 2024
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, చోరీపై విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విలువైన వస్తువుల భద్రతపై శ్రద్ధ వహించడానికి ఈ సంఘటన మరో పాఠాన్ని నేర్పింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..