Snake in Kitchen: వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!

Snake in Kitchen: వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!

Anil kumar poka

|

Updated on: Sep 03, 2024 | 11:33 AM

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఇక వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు, మొసళ్లు తమ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో, బైకుల్లో ఎక్కడపడితే అక్కడ పాములు చేరుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌ నగరం సర్కార్‌నగర్‌లో అలాంటి ఘటనే జరిగింది.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఇక వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు, మొసళ్లు తమ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో, బైకుల్లో ఎక్కడపడితే అక్కడ పాములు చేరుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌ నగరం సర్కార్‌నగర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంట్లోని వంటగది నుంచి.. గిన్నెల శబ్ధం రావడంతో.. పిల్లి వచ్చిందేమో అని చూసేందుకు వెళ్లింది ఆ ఇంటి యజమాని. కానీ అక్కడ కనిపించింది చూసి భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఆమె లోపలికి వెళ్లగానే పెద్ద నాగుపాము పడగవిప్పి కనిపించడంతో.. ఆమె భయబ్రాంతులకు గురైంది. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అతను వచ్చి.. వంటగదిలో నక్కిన పాము చాకచక్యంగా బంధించాడు.

స్నేక్ క్యాచర్ పామును బంధిస్తున్న సమయంలో అది పడగవిప్పి స్నేక్‌ క్యాచర్‌పై దాడికి యత్నించింది. అయితే పాముకి ఆ అవకాశం ఇవ్వకుండా స్నేక్‌ క్యాచర్‌ ఎంతో చాకచక్యంగా ఓ పైపు సాయంతో పామును బంధించాడు. ఆ ప్రమాదకర నాగుపామును అతని సంచిలో బంధించాడు. ఆపై దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అలవోకగా పామును బంధించిన స్నేక్ క్యాచర్‌ ధైర్యసాహసాలను నెటిజన్స్ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.