Vijayawada Floods: విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.

ఇది విజయవాడ పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం.. నష్టం. కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన.. మనసులను కలచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా?

Vijayawada Floods: విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.

|

Updated on: Sep 03, 2024 | 12:22 PM

ఇది విజయవాడ పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం.. నష్టం. కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన.. మనసులను కలచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా? ఎందుకంటే.. ఇటు బుడమేరు, అటు కృష్ణా నది.. మధ్యలో బెడవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. రెండు రోజులుగా నరకం. ఈమధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్.. ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీవర్షాలు, ఆపై వరదలు.. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటలకొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పని చేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.

కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారిని భవనాల పైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు.. విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50 వేల ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేయాల్సి చేపట్టాల్సి వచ్చింది. అటు అక్షయపాత్ర, హోటల్స్ అసోసియేషన్.. ఇలా అంతా వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు. అయినా రెండు రోజులుగా బాధితులకు సమస్యలు తప్పలేదు. అసలు విజయవాడకు ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి? బుడమేరు వాగేనా?

ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ.. దాదాపు గత అర్థ శతాబ్దంలో.. ఎప్పుడూ చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు. కాలనీలకు కాలనీలు నీట మునిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే.. పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూటులో వెళుతుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయ్యింది? బుడమేరు వాగు ప్రవాహం.. శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళుతుంది. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే.. కృష్ణా నదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా.. గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్న, గన్నవరం.. ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్ మెంట్ లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.
విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.
రాజస్థాన్‌లో కుప్ప కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. షాకింగ్‌ వీడియో
రాజస్థాన్‌లో కుప్ప కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. షాకింగ్‌ వీడియో
హమ్మయ్యా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు సేఫ్..
హమ్మయ్యా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు సేఫ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!
ఒక్క పూట అయినా అన్నం దొరికితే బాగుండు.. సింగ్ నగర్ కన్నీటి వ్యధలు
ఒక్క పూట అయినా అన్నం దొరికితే బాగుండు.. సింగ్ నగర్ కన్నీటి వ్యధలు
వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!
వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!
గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర.? పెట్రోల్‌
గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర.? పెట్రోల్‌
ఆనందంగా డాన్స్‌ చేస్తూ అనంతలోకాలకు.! కుప్పకూలిన కానిస్టేబుల్‌..
ఆనందంగా డాన్స్‌ చేస్తూ అనంతలోకాలకు.! కుప్పకూలిన కానిస్టేబుల్‌..
30 నిమిషాల్లో 3 సార్లు ఫోన్‌..ఒక్కోసారి ఒక్కోలా.! కోల్‌కతా కేసు..
30 నిమిషాల్లో 3 సార్లు ఫోన్‌..ఒక్కోసారి ఒక్కోలా.! కోల్‌కతా కేసు..
తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం
తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం