Telangana: మోటార్ ఆన్ చేయకుండానే.. బోరు నుంచి ఉబికివస్తున్న జలసిరి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. అన్ని చోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎండిపోయిన బోర్లు కూడా ఇప్పుడు పైపుల నిండుగా నీరు పోస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా బోరు బావుల్లో నుంచి జలాలు ఉబికి వస్తున్నాయి.. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో కనిపించింది.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లి (H) గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బోర్ ఆన్ చేయకుండానే బోరు బావి నుండి నీళ్ళు బయటకు ఉబికి వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పల్లి (H) గ్రామానికి చెందిన ఉమానంద్ అనే రైతు పొలంలో బోరు ఉంది. దాని నుండి పవర్ ఆన్ చేయకుండానే నీరు ఎగిసిపడుతుంది, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి… బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా బోరు నుండి ఉబికి వస్తుండగా స్థానికులు వీడియో రికార్డు చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులు ,వంకలు కారణంగానే ఓవర్ ఫ్లోతో ఇలా గంగ ఉప్పొంగి బోరు నుండి ఇలా ఉబికి వస్తుందని అంటున్నారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

