విమానంలో టాయిలెంట్‌కి వెళ్లిన ప్రయాణికులకు షాకింగ్‌ సీన్‌.. ఉలిక్కి పడ్డ సిబ్బంది.. కట్‌ చేస్తే ..!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటం, మరోవైపు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బంగారం, నగలు, నగదు, మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగిపోయింది. కొత్త కొత్త దారుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా వినూత్న రీతుల్లో స్మగ్లింగ్‌ చేస్తూ ఏదో రకంగా అధికారులకు పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలోనే అబుదాబి నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో 3.461 కిలోల బంగారం పట్టుబడింది.

విమానంలో టాయిలెంట్‌కి వెళ్లిన ప్రయాణికులకు షాకింగ్‌ సీన్‌.. ఉలిక్కి పడ్డ సిబ్బంది.. కట్‌ చేస్తే ..!
Indigo Flight
Follow us

|

Updated on: Oct 25, 2023 | 10:33 AM

కేరళలోని నేడుంబాసెరి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానంలోని టాయిలెట్‌లో రూ.2.15 కోట్ల విలువైన బంగారం పడిపోయి కనిపించింది. అబుదాబి నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో 3.461 కిలోల బంగారాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో విమానంలో బంగారం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా ప్లాస్టిక్‌లో చుట్టిన బంగారు బిస్కెట్లు, బంగారు మిశ్రమం విమానంలోని టాయిలెంట్‌లో కనిపించాయి. DRI విమాన సిబ్బంది, ప్రయాణీకుల సమాచారాన్ని సేకరించారు. వారిని పిలిపించి విచారణ మొదలుపెట్టారు. మరుగుదొడ్లకు వెళ్లినట్లు నటిస్తూ బంగారాన్ని దాచిపెట్టి, క్లీన్‌ సిబ్బందితో వాటిని బయటకు తీయించిన ఘటనలు కూడా గతంలో అనేకం ఉన్నాయి. ఇది బహుశా అదే విధమైన చర్య కావచ్చునని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, గత రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడి వద్ద గల బ్యాగులో 610 గ్రాముల బంగారం గుర్తించి సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.32.8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే, మరో ప్రయాణికుడి వద్ద 483 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటం, మరోవైపు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బంగారం, నగలు, నగదు, మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగిపోయింది. కొత్త కొత్త దారుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా వినూత్న రీతుల్లో స్మగ్లింగ్‌ చేస్తూ ఏదో రకంగా అధికారులకు పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలోనే కేరళలోని విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు జరుపుతుండగా అబుదాబి నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో 3.461 కిలోల బంగారం పట్టుబడింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, తెలంగాణలో పట్టుబడుతున్న నగదు లెక్కలకు హద్దులు లేకుండా ఉంది. లెక్కా పత్రం లేకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదు పోలీసుల తనిఖీల్లో పట్టబడుతుంది. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!