PM Modi: కమల వికాలం.. మోడీ మేనియా.. గ్లోబల్ మీడియాలో ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం..

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 156 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను ఊడ్చిపారేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడో సారి అధికారం సాధించి సీఎం పీఠాన్ని...

PM Modi: కమల వికాలం.. మోడీ మేనియా.. గ్లోబల్ మీడియాలో ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం..
Pm Modi

Updated on: Dec 09, 2022 | 6:04 PM

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 156 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను ఊడ్చిపారేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడో సారి అధికారం సాధించి సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతోంది. 1960లో గుజరాత్ ఏర్పడిన తర్వాత ఏ పార్టీ కూడా ఇంత పెద్ద విజయం సాధించలేదు. 2017లో బీజేపీ 100 కూడా దాటలేకపోయింది. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 156 సీట్లు సాధించడం బీజేపీకి కొత్త ఊపిరులిచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా తన సొంత రాష్ట్రంలో తన సత్తా ఏంటో చూపించారు. ఈ విజయాన్ని ప్రపంచ మీడియా సంస్థలు ప్రశంసించాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్, నిక్కీ ఆసియా, అల్-జజీరా, ఇండిపెండెంట్, ఏబీసీ న్యూస్, ది గార్డియన్ బీజేపీ చరిత్రాత్మక బీజేపీ విజయ కథనాలు అందించాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తమ పార్టీకి కొత్త జవసత్వాలు నింపారని బ్రిటీష్ పబ్లికేషన్ ది గార్డియన్ పేర్కొంది. 2024లో జరిగే జాతీయ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో రికార్డు విజయం బీజేపీకి అతిపెద్ద విజయమని యూకేకు చెందిన ఇండిపెండెంట్ వివరించింది.

1995 నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఉదహరిస్తూ, జపాన్‌కు చెందిన నిక్కీ ఆసియా గుజరాత్ రాష్ట్రంలో పీఎం మోడీకి ఉన్న ప్రజాదరణే ఈ విజయానికి కారణమని పేర్కొంది. 2014లో ప్రధాని కావడానికి ముందు దాదాపు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అని పేపర్ పేర్కొంది. బీజేపీకి స్టార్ పవర్ అయిన రాష్ట్రంలో ప్రధాని మోదీ అనేక ర్యాలీలు నిర్వహించారని జపాన్ మీడియా పేర్కొంది. గుజరాత్‌లో జన్మించిన మోడీ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా మంది పౌరులు గర్వపడుతున్నారు అభిప్రాయపడింది.

గుజరాత్‌లో బీజేపీ సాధించిన ఈ విజయం హిందూ ఓట్ల సమీకరణ అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను ఉటంకిస్తూ అల్-జజీరా రాసింది. గురువారం ప్రధాని మోదీ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారు. పార్టీ కార్యకర్తలను ఛాంపియన్లుగా అభివర్ణిస్తూ, మీరు లేకుంటే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమయ్యేది కాదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..