పెళ్లి కోసం బ్యాంకు రుణాలు.! అప్లై చేసుకుంటున్న అమ్మాయిలు

| Edited By: Srinu

Feb 08, 2020 | 7:29 PM

వెనకటికి ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనేవారు.. అంటే అప్పట్లో రెండూ బహుకష్టమే అన్న మాట! ఇప్పుడు పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడమే ఈజీ..! పందిళ్లు.. సందళ్లు.. తాళాలు.. తలంబ్రాల కాలం కాదిది! మూడు ముళ్లు.. ఏడు అడుగులతో పాటు ఇంకా బోలెడుండాలి… అందుకు బోలెడంత డబ్బుండాలి… పెళ్లనేది ఓ మెమరబుల్‌ ఈవెంట్‌ కాబట్టే ఖర్చుకు వెనుకాడరు.. అవసరమైతే అప్పోసప్పో చేస్తారు.. అందుకే ఈ మధ్య బ్యాంకులు కూడా పెళ్లి కోసం లోన్‌లిస్తున్నాయి.. […]

పెళ్లి కోసం బ్యాంకు రుణాలు.! అప్లై చేసుకుంటున్న అమ్మాయిలు
Follow us on

వెనకటికి ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనేవారు.. అంటే అప్పట్లో రెండూ బహుకష్టమే అన్న మాట! ఇప్పుడు పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడమే ఈజీ..! పందిళ్లు.. సందళ్లు.. తాళాలు.. తలంబ్రాల కాలం కాదిది! మూడు ముళ్లు.. ఏడు అడుగులతో పాటు ఇంకా బోలెడుండాలి… అందుకు బోలెడంత డబ్బుండాలి… పెళ్లనేది ఓ మెమరబుల్‌ ఈవెంట్‌ కాబట్టే ఖర్చుకు వెనుకాడరు.. అవసరమైతే అప్పోసప్పో చేస్తారు.. అందుకే ఈ మధ్య బ్యాంకులు కూడా పెళ్లి కోసం లోన్‌లిస్తున్నాయి.. వెడ్డింగ్‌ లోన్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి బ్యాంకులు.. లాస్టియర్‌తో పోలిస్తే వెడ్డింగ్‌లోన్‌ కోసం అప్లై చేసుకున్నవారి సంఖ్య ఫిఫ్టీపర్సెంట్‌ పెరిగింది… అన్నట్టు అప్లై చేసుకునేవారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారట! అవును మరి .. ఎక్కువ ఖర్చు వాళ్లకేకదా!

పెళ్లంటే నగలు కొనాలి.. చీరలు కొనాలి.. ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేయాలి.. కేటరింగ్‌వాళ్లతో సంప్రదింపులు జరపాలి.. కార్డులు కొట్టించాలి.. పక్క ఊళ్లలోంచి వచ్చే బంధువులకు మంచి బస ఏర్పాటు చేయాలి… మరి వీటన్నింటికీ డబ్బు కావాలి కదా! బ్యాంకుల్లో అప్లై చేసుకుంటున్నప్పుడు ఇదే కారణాలు చూపించి లోన్‌లు అడుగుతున్నారట! పిండికొద్ది రొట్టే అన్నట్టు కొందరు రెండు లక్షలు అడుగుతుంటే.. కొందరు 30 లక్షల లోన్‌ కావాలంటున్నారట! మరికొందరు ఇస్తే అరకోటి అయినా తీసుకోడానికి రెడీగా ఉన్నారట! తమ పెళ్లిభారం తల్లిదండ్రుల మీద పడకూడదన్నది నేటితరం ఆడపిల్లల భావన!