అమ్మాయిని చంపి 30 ముక్కలుగా నరికిన దంపతులు.. పోలీసుల విచారణలో షాకింగ్‌ నిజాలు..

|

Nov 26, 2023 | 10:09 PM

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టిలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. తప్పిపోయిన బాలిక గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను పిలిపించి ఆరా తీయగా, ఆ తల్లిదండ్రులు తమ కూతురి శరీర భాగాలను గుర్తుపట్టి తల్లడిల్లిపోయారు.. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానం వచ్చిన ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించటంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

అమ్మాయిని చంపి 30 ముక్కలుగా నరికిన దంపతులు.. పోలీసుల విచారణలో షాకింగ్‌ నిజాలు..
Crime News
Follow us on

ఒక మహిళను హత్య చేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారం కారణంగా 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు బాలికకు ఓ వివాహిత వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని సమాచారం. బాలికను పెళ్లి చేసుకుంటానని నిందితుడు నమ్మించి మోసం చేశాడు. దీంతో బాలిక తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిపై ఒత్తిడి చేసింది. బుధవారం సాయంత్రం బాలిక, నిందితుడికి మధ్య పెళ్లి విషయమై వాగ్వాదం జరిగింది. విషయం బయటకు పొక్కడంతో నిందితుడైన యువకుడు తన భార్యతో కలిసి బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ముప్పై ముక్కలుగా చేసి పాతిపెట్టాడు. అర్థరాత్రి వరకు బాలిక ఇంటికి చేరుకోకపోవటంతో, బాలిక కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను ఆదివారం రోజున అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఒడిస్సాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌ఘర్ బ్లాక్‌లోని బగ్‌బేరా గ్రామం. తిల్బాటి గోండ్‌కు చెందిన బాలిక బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఎన్ని చోట్ల వెతికినా బాలిక కనిపించకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మురుమిడిహి గ్రామ సమీపంలోని అడవిలో మృతదేహాన్ని పాతిపెట్టినట్టుగా గుర్తించారు. మహిళ మృతదేహంలోని 30 ముక్కలను కనుగొన్నారు. మృతదేహం అదృశ్యమైన బాలికదిగా గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తండ్రి ధృవీకరించారు. అనుమానం వచ్చిన పోలీసులు కొందరు స్థానికులను విచారించగా అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన పోలీసులు హత్యానేరం కింద నిందితులైన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు తమ నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. మృతిచెందిన బాలికతో తను గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని నిందితుడు చెప్పాడు. బుధవారం సాయంత్రం మృతురాలు తననను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. నిందితుడి భార్య బాలికకు వివరించేందుకు ప్రయత్నించడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం మరింతగా ముదిరింది. పెళ్లి విషయంలో బాలిక పట్టుబట్టడంతో ఆ దంపతులు ఇద్దరూ కలిసి బాలికను కొట్టడం ప్రారంభించారు. ఈ గొడవలో తలకు బలమైన గాయం కావడంతో బాలిక మృతి చెందింది. దాంతో దంపతులు ఇద్దరూ కలిసి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి అడవిలో మట్టిలో పాతిపెట్టారు. వారి ఆనవాళ్లు లభించకుండా బట్టలు కూడా తగులబెట్టారు.

ఇవి కూడా చదవండి

శనివారం ఉదయం మురుమిడిహి గ్రామానికి చెందిన ఓ యువకుడు చింతచెట్టు కింద రక్తాన్ని చూసి గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మట్టిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తప్పిపోయిన బాలిక గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించటంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..