బోరుబావిలో పసి ప్రాణం.. ఆడుకుంటూ వెళ్లి పడిపోయిన బాలిక.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

|

Jan 01, 2024 | 7:57 PM

Girl Falls Into Borewell: న్యూ ఇయర్ వేళ గుజరాత్ లో ఓ బాలిక బోరుబావిలో పడిపోయింది. రెండున్నరేళ్ల బాలికను ఏంజెల్ సఖ్రాగా గుర్తించారు. బాలిక ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. ద్వారక సమీపంలోని రాన్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

బోరుబావిలో పసి ప్రాణం.. ఆడుకుంటూ వెళ్లి పడిపోయిన బాలిక.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
Girl Falls Into Borewell
Follow us on

Girl Falls Into Borewell: న్యూ ఇయర్ వేళ గుజరాత్ లో ఓ బాలిక బోరుబావిలో పడిపోయింది. రెండున్నరేళ్ల బాలికను ఏంజెల్ సఖ్రాగా గుర్తించారు. బాలిక ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. ద్వారక సమీపంలోని రాన్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. బాలికను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సిబ్బంది బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు. ఘటనాస్థలానికి ఇప్పటికే ఫైర్‌ సిబ్బంది చేరుకున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సైతం రంగంలోకి దిగి బాలికను రక్షించేందుకు ఆపరేషన్ ను చేపట్టింది.

బోరుబావిలో ప్రాణం బిగబట్టి ఉన్న రెండున్నరేళ్ల పాపను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తెచ్చేందుకు యంత్రాలను కూడా తరలిస్తున్నారు. ఏంజెల్ ఇంటి ముందు ఆడుకుంటుండగా, మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఆమె బోర్‌వెల్‌లోకి జారిపోయినట్లు అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

బాలికను రక్షించేందుకు, అధికారులు తమకు సహాయం చేయాలని భారత సైన్యాన్ని అభ్యర్థించారు. ఘటనాస్థలికి చేరుకున్న భారత ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ద్వారకా జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


బాలిక దాదాపు 30 అడుగుల లోతులో చిక్కుకుపోయిందని జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ తెలిపారు. ఆరోగ్య శాఖ బృందం బోర్‌వెల్‌లో ఆక్సిజన్‌ను పంపుతోందని.. బాలికను బోర్‌వెల్ నుంచి బయటకు తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని అని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోరుబావి నుంచి అమ్మాయి ఏడుపులు వినబడుతున్నాయని.. ద్వారకా SDM (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్) హితేష్ భగోరా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..