ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పక ఉంటుంది. తులసిని హిందువులు పవిత్రంగా భావించి పూజిస్తుంటారు. ఏ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టినా మొదట కనిపిస్తుంది తులసి కోట లేదంటే తులసి మొక్క. అలాంటి తులసి మొక్క సాధారణంగా 2 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతుంది. అయితే గుజరాత్‌లోని వడోదరలో మాత్రం తులసి మొక్క భారీ ఎత్తుతో పెరిగింది. దానికి సంబంధించిన షాకింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తులసి మొక్క పొడవు 7 అడుగులుగా తెలిసింది.. ఈ మొక్క ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తులసి మొక్క ఏడడుగులు ఎలా పెరిగిందంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది వడోదరలోని అకోటా నివాసి మనోజ్ త్రిపాఠి ఇంట్లో ఉంది.
మనోజ్ త్రిపాఠి ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. అతని ఇంట్లోనిదే ఈ భారీ పొడవైన తులసి మొక్క. ఏపుగా పెరుగుతున్న ఈ తులసి మొక్కను చూసి మనోజ్ మరింత జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. అలా పెరుగుతూ పోయిన ఈ తులసి మొక్క ప్రపంచ రికార్డును లిఖించాలని అతను కోరుకుంటున్నారు. ఈ తులసి మొక్క గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడగా, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తులసి మొక్క 11 అడుగుల పొడవు ఉందని అతనికి తెలిసింది. ప్రపంచంలోనే అతి పొడవైన తులసి మొక్క గ్రీస్‌లో ఉన్నట్టుగా తెలిసింది.
ఈ తులసి మొక్క గురించి అడిగినప్పుడు, మనోజ్ మాట్లాడుతూ.. ఇది రామ తులసి మొక్క అడవి జాతి అని చెప్పారు. ఈ తులసి మొక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఈ మొక్క అద్భుతమైన పెరుగుదల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పాడు.
అయితే, ఈ మొక్క ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం చాలా వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మంచి నేల, సరిపడా నీటి సౌకర్యం ఈ మొక్క పెరుగుదలకు అవసరమన్నారు. ఇకపోతే, భవిష్యత్తులో ఈ తులసి మొక్క ప్రపంచ రికార్డును లిఖిస్తుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..