Ghulam Nabi Azad: భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులే.. గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు..

|

Aug 18, 2023 | 8:19 AM

మాజీ కాంగ్రెస్‌ పార్టీ నేత గులాం నబీ ఆజాద్‌ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదన్నారు ఆజాద్‌. అంతేకాదు.. భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని, కానీ హిందూమతం అత్యంత పురాతనమైందన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలలో బయటిదేశాల నుంచి వచ్చిన వాళ్లు కొంతమందే ఉంటారని, మిగతా వాళ్లంతా ముస్లిం మతంలోకి..

Ghulam Nabi Azad: భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులే.. గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు..
Ghulam Nabi Azad
Follow us on

దేశంలో ఇప్పుడిదొక హాట్ టాపిక్. ముస్లిం అయిన గులాం నబీ ఆజాద్ స్వయంగా ఈ కామెంట్స్ చెయ్యడం అసాధారణ విషయం. ఆయన కేవలం కశ్మీరీ ముస్లింలనే కాదు.. యావత్ భారతీయ ముస్లింలందరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇంతకీ ఆయన ఏమన్నారు? అంత పెద్ద కామెంట్స్ ఏం చేశారు? ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకీ కామెంట్స్ చేశారు? ప్రత్యర్థులు అన్నట్లు ఎవరి మెప్పు కోసం చేశారు? సంచలనం రేపుతున్న ఆ కామెంట్స్ ఏంటో తెలియాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

మాజీ కాంగ్రెస్‌ పార్టీ నేత గులాం నబీ ఆజాద్‌ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదన్నారు ఆజాద్‌. అంతేకాదు.. భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని, కానీ హిందూమతం అత్యంత పురాతనమైందన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలలో బయటిదేశాల నుంచి వచ్చిన వాళ్లు కొంతమందే ఉంటారని, మిగతా వాళ్లంతా ముస్లిం మతంలోకి మారిన హిందువులేనని అన్నారు. ఇస్లాం మతల కేవలం 1,500 ఏళ్ల నుంచి మాత్రమే ఉందన్నారు ఆజాద్.

ఇవి కూడా చదవండి

జమ్ముకశ్మీర్‌‌లోని దోడా జిల్లా తాల్హ్రీ ప్రాంతంలో జరిగిన సభలో ఆజాద్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కశ్మీరీ పండిట్‌ల గురించి మాట్లాడుతూ.. వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారన్నారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లీం కూడా లేరని, కశ్మీర్‌ పండిట్స్‌లో చాలామంది ముస్లింలుగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలంతా హిందూమతంలోనే జన్మించారన్నారు.

ఆజాద్ కామెంట్స్ యధావిధిగా.. ‘భారత్‌ లోనే కాదు.. ప్రపంచంలో కూడా ఇస్లాం మతం కేవలం 1500 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. హిందూ మతం అతిపురాతనమైనది. ఎవరో 10 లేదా 20 మంది మొగల్‌ కాలంలో సైనికులుగా వచ్చి ఉంటారు. మిగతా వాళ్లంతా హిందూమతం నుంచి ముస్లిం మతానికి మారినవాళ్లే. మన కశ్మీర్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 600 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇస్లాం వచ్చింది. కశ్మీర్‌ పండిట్లంతా ముస్లింలుగా మారిపోయారు. అందరం హిందూ మతంలోనే జన్మించాం. హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు.. ఇలా పేరుకి వేరువేరుగా ఉన్నా అందరి మూలాలు ఒక్కటే. ఇక్కడికి ఎవరూ కూడా బయటి నుండి రాలేదు. అందరూ ఇక్కడి వారే. మనమంతా ఇదే మట్టిపై పుట్టాం.. ఇదే మట్టిపై మరణిస్తాం’ అని అన్నారు గులాం నబీ ఆజాద్.

గులాం నబీ ఆజాద్ కామెంట్స్‌కి రియాక్షన్స్..

గులాం నబీ ఆజాద్ కామెంట్స్‌పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తుంటే.. ముస్లింపు సంఘాలు భగ్గుమంటున్నాయి. గులాం నబీ ఆజాద్‌‌ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని హిందూ మహాసభ ప్రతినిధులు అన్నారు. అందరూ ఒకప్పటి సనాతన బ్రాహ్మణులని, పరిస్థితుల ప్రభావంతో మతం మారారని అన్నారు. హిందూ మతం వసుధైక కుటుంబం లాంటిదని, అందరూ హిందూమతంలోకి రావాలని పిలుపునిచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు.

ఆజాద్ వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు మండిపడుతున్నారు. గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై స్పందించారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. ఆయన ఏ సందర్భంలో అలా అన్నారో.. ఎందుకు అన్నారో… ఎవరిని సంతోషపెట్టడానికి అలా మాట్లాడారో తనకు తెలియదన్నారు ఒమర్‌ అబ్దుల్లా. ఇక మెహబూబా ముఫ్తీ.. ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. ‘అతను ఎంత వెనక్కి వెళ్లి ఆలోచించి, ఈ కామెంట్స్ చేశాడో అర్థం అవడం లేదు. అతని పూర్వీకుల గురించి అతనికి ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. అయితే, తన పూర్వీకుల గురించి ఓసారి తెలుసుకోమని మాత్రం సలహా ఇస్తాను. మళ్లీ ఓసారి పూర్వీకుల కాలానికి వెళ్లాలని సలహా ఇస్తున్నా. అలా అయినా తను తన పూర్వీకులను కనుగొంటాడేమో’ అంటూ ఆజాద్‌కు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి గులాంనబీఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు హిందూ సంఘాలు స్వాగతిస్తుంటే ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి. బీజేపీ నేతల మెప్పు కోసమే ఇలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.

కాగా, దాదాపు ఐదు దశాబ్దాలు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించిన గులాం నబీ ఆజాద్.. సొంతంగా పార్టీ పెట్టాడు. ‘డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ’ ని ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.

మెహబూబా ముఫ్తీ రియాక్షన్స్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..