
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘజియాబాద్ జిల్లా ట్రోనికా సిటీ ప్రాంతంలోని బట్టల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లక్షల విలువైన దుస్తులు కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.
వీడియో ఇక్కడ చూడండి..