ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మొక్కులు తీర్చుకుని భక్తులు బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు.
ఈ బిర్యానీ ప్రసాదం ఆనవాయితీ ఇటీవల మొదలైంది కాదు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏటా జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం వెయ్యి కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఈ రెండు రోజులు అదే ప్రసాదంగా అందిస్తారు.
ప్రసాదం కదా. కొంచెమే పెడతారనుకోవద్దు. ఈ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఓవైపు పూజలు.. వాయిద్యాలు మోగుతుంటే మరోవైపు బిర్యానీ టేస్ట్ చూస్తుంటారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..