Oliver Kahn: 15 ఏళ్లు గడిచినా వీడని స్నేహ బంధం.. పాత ఫ్రెండ్‌ను కలుసుకున్న ఆలివర్‌ ఖాన్‌

భారత్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి జుల్ఫికల్ హసన్‌ను ఆలివార్‌ గురువారం కలిశారు. వీరిద్దరూ వేరు వేరు రంగాల్లో ఉన్నా ఫుట్‌బాల్‌ కారణంగానే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంతకీ వీరిద్దరి మధ్య ఇంతటి స్నేహ బంధం ఎలా ఏర్పడిందంటే. 15 ఏళ్ల క్రితం ఆలివర్‌ కాన్‌ కోల్‌కతా వచ్చిన సమయంలో.. మోహన్ బగాన్‌, బేయర్న్‌ మ్యూనిచల్‌ మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ ఆలివర్ కాన్‌ క్లబ్‌కు చివరి గేమ్...

Oliver Kahn: 15 ఏళ్లు గడిచినా వీడని స్నేహ బంధం.. పాత ఫ్రెండ్‌ను కలుసుకున్న ఆలివర్‌ ఖాన్‌
Oliver Kahn And Zulfiqar

Updated on: Nov 09, 2023 | 6:56 PM

జర్మనీ మాజీ లెజెండరీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌.. ఆలివర్ ఖాన్ భారత్‌కు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన గురువారం ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ఆలివర్ ఖాన్‌ తన స్నేహితిడుని కలుసుకున్నారు. 15 ఏళ్లయినా మర్చిపోకుండా భారత్‌లోని స్నేహితుడిని కలుసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

భారత్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి జుల్ఫికల్ హసన్‌ను ఆలివార్‌ గురువారం కలిశారు. వీరిద్దరూ వేరు వేరు రంగాల్లో ఉన్నా ఫుట్‌బాల్‌ కారణంగానే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంతకీ వీరిద్దరి మధ్య ఇంతటి స్నేహ బంధం ఎలా ఏర్పడిందంటే. 15 ఏళ్ల క్రితం ఆలివర్‌ కాన్‌ కోల్‌కతా వచ్చిన సమయంలో.. మోహన్ బగాన్‌, బేయర్న్‌ మ్యూనిచల్‌ మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ ఆలివర్ కాన్‌ క్లబ్‌కు చివరి గేమ్. ఆ సమయంలో కోల్‌కతా అసిస్టెంట్ కమిషనర్‌గా జుల్ఫికర్ హసన్ పనిచేస్తున్నారు. కోల్‌కతా పోలీస్ నైబర్‌హుడ్ ఫుట్‌బాల్ జుల్ఫికర్ హసన్ చొరవతోనే ప్రారంభమైంది. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ఒలివర్ కాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడే వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు.

ఆలివర్, జుల్ఫికర్ కలుసుకుని 15 సంవత్సరాలు పూర్తయింది. అయితే చాలా ఏళ్ల తర్వాత కూడా ఇద్దరూ ఒకరికొకరు టచ్‌లో ఉన్నారు. ఆలివర్ భారతదేశాన్ని సందర్శించిన తర్వాత.. జుల్ఫికర్ హసన్‌ను కలిసినట్లు తెలిపారు. జుల్ఫికర్ ఢిల్లీలో ఉన్నాడని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి కలుసుకున్నారు. జుల్ఫికర్‌ ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే జుల్ఫికలర్‌ గడిచిన 15 ఏళ్లలో దేశంలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. అనంతరం కొన్నేళ్లపాటు కశ్మీర్‌లోని దంతేవాడలో, లాల్‌గఢ్‌లో సేవలందించారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ జుల్ఫికర్‌ ఫుట్‌బాల్‌పై ప్రేమను పెంచుకున్నారు. లాల్‌గఢ్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వర్ధమాన ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రేరేపించడానికి శిక్షణ కోసం బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌కు పంపించారు. దంతెవాడలో నిర్వహించిన టోర్నీలో 700 క్లబ్‌లు పాల్గొన్నాయి. అంతేకాదు, ఫుట్‌బాల్ క్రీడాకారులకు వేదికగా నిలిచేందుకు కూడా లాలిగా క్లబ్‌లో జుల్ఫిర్ శిక్షణను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..