
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అయింది. ఈ సదస్సులో 20 దేశాల సభ్యులతోపాటు.. 9 ఆహ్వానిత దేశాల సభ్యులు అంతర్జాతీయ అంశాలు, పలు సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. జీ20 గ్రూప్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’కు సంబంధించిన విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడం సంతృప్తినిచ్చిందంటూ సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా.. G20 శిఖరాగ్ర సమావేశానికి వేదికైన భారత్ మండపంలో ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్ – ‘కల్చర్ కారిడార్ – G20 డిజిటల్ మ్యూజియం’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. జీ20 సదస్సులో కల్చర్ కారిడార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్చరల్ కారిడార్ G20 సభ్యులు, ఆహ్వానిత దేశాల భాగస్వామ్య వారసత్వాన్ని సూచిస్తుంది. ఇది G20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల గుర్తింపు చిహ్నాలు.. గుర్తించదగిన సాంస్కృతిక వస్తువులు.. వారసత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈ కల్చర్ కారిడార్ విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణల అవగాహన.. వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడం, చేరిక, సమానత్వం కోసం.. భాగస్వామ్య గుర్తింపు భావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం G20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’, కల్చర్ వర్కింగ్ గ్రూప్ (CWG) హాల్‌మార్క్ క్యాంపెయిన్ ‘కల్చర్ యూనైట్స్ ఆల్’ ఆధారంగా రూపొందించారు. జీ20 సదస్సు జరిగే భారత మండంపలో దీనిని ఆవిష్కరించి.. రెండు రోజుల పాటు ప్రదర్శించారు. దీనిలో దేశాల వారీగా G20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల సాంస్కృతిక వస్తువులు, వారసత్వ వివరాలను ప్రతినిధులకు తెలిసేలా.. ఏర్పాట్లు చేశారు.
Culture Corridor – G20 Digital Museum ప్రధాన ఉద్దేశం.. సాంస్కృతిక ప్రాముఖ్యత, దిగ్గజ కళాఖండాలు, కనిపించని సాంస్కృతిక వారసత్వం, సహజ వారసత్వం, ప్రజాస్వామ్య పద్ధతులకు సంబంధించిన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. G20 సమ్మిట్ వేదిక సభ్య దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, అవగాహనను ప్రోత్సహించడానికి ఒక కళ.. సంస్కృతి ప్రదర్శనను నిర్వహించారు. వివిధ కళాఖండాలు, సాంస్కృతిక కళాఖండాలను ప్రదర్శించడం ద్వారా, సమ్మిట్ లో పాల్గొనే ప్రతి దేశం విభిన్న వారసత్వం, చరిత్రను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని భారత్ సఫలీకృతమైంది.
Culture Corridor
పాణిని అష్టాధ్యాయి అనేది క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో పండితుడు పాణిని రచించిన భాషా గ్రంథం.. ఇది సంస్కృతం రాయడానికి, మాట్లాడటానికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇది భారతదేశ భాషా చరిత్రలో కీలకమైన భాగం. దీని చేరిక భాష అభివృద్ధికి భారతదేశం, సహకారాన్ని, భాషా అధ్యయనాలపై దాని శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం