PM Modi: ప్రధాని మోదీతో ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ కీలక భేటి.. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులపై చర్చ

|

Aug 14, 2024 | 8:20 PM

తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్(ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు భారత్‌లో పర్యటించారు. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై.. కీలక విషయాలను చర్చించారు. ఆ వివరాలు ఇలా..

PM Modi: ప్రధాని మోదీతో ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ కీలక భేటి.. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులపై చర్చ
Narendra Modi Foxcon Grou
Follow us on

తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్(ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు భారత్‌లో పర్యటించారు. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై.. కీలక విషయాలను చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్‌తో జరిగిన భేటి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ప్రధాని మోదీ.

భవిష్యత్ రంగాలలో భారతదేశం అందించే అద్భుతమైన అవకాశాలను తాను హైలైట్ చేశానని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో వారి పెట్టుబడి ప్రణాళికలపై కూడా చర్చలు జరిపామని అన్నారు ప్రధాని మోదీ. మరోవైపు ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియును పద్మభూషణ్ అవార్డు‌తో సత్కరించిన సంగతి తెలిసిందే.

ఈ అవార్డును ఆయనకు జూలై 4న ఇండియా తైపీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ మన్‌హర్సిన్హ అందజేశారు. ఇక ఇప్పటికే ఫాక్స్‌కాన్ గ్రూప్ సుమారు 9-10 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టి.. దేశంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి