కొవిడ్ నాలుగో వేవ్(Fourth Wave) రాబోతోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. విజవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దేశ ప్రజలనుద్దేశించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో ఒమిక్రాన్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ (Stelth Omicron) జోరుగా వ్యాపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోందని చెప్పింది. ప్రస్తుతం తగ్గిన కేసులను చూసి కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దని, అజాగ్రత్తగా ఉండొద్దని ప్రజలను కోరింది. మాస్కులు ధరించడం మానివేయొద్దని, శానిటైజర్లు వాడమని దేశప్రజలకు సూచిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతుండగా చైనాలో కరోనా వ్యా్ప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ‘స్టెల్త్ ఒమిక్రాన్’ రూపంలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.
మార్చి 2020 తర్వాత అత్యధికంగా రోజువారీ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ ఏకమైతే.. చైనా మాత్రం రెండేళ్లుగా జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. కేసులు భారీగా పెరుగుతుండటంతో చైనాలోని 13 పెద్ద నగరాలను సీల్ చేసి.. 3 కోట్ల మందికి పైగా ప్రజలను ‘లాక్‌డౌన్’లో ఉంచింది. అత్యవసరమైనవి తప్పా మిగతా పరిశ్రమలు మూసివేసి, ప్రజారవాణాను నిలిపివేశారు. రాజధాని బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బీజింగ్, షాంఘైలకు విమాన ప్రయాణాలు రద్దు చేశారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లను సడలించడం అసాధ్యమని చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కళ్లూ వీలైనంత వేగంగా టీకాతో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
చైనాలోని దాదాపు 80 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కొవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కట్టడి చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, వైరస్‌తో కలిసి జీవించే వ్యూహంతో ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయి. కానీ చైనా మాత్రం కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే జీరో కొవిడ్ వ్యూహాన్ని నమ్ముకుంది. తాజాగా డెల్టాతో పాటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగడంతో డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. చైనాను వణికిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపవర్గం ‘BA.2’ను ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్నారు. దీనిపై బ్రిటన్ ఆరోగ్య, భద్రత సంస్థ (యూకేహెచ్‌ఎస్‌ఏ) పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొవిడ్ కట్టడి వ్యూహాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న దక్షిణ కొరియాలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం రేపుతోంది.
Also Read
Tirumala: తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి
Holi 2022: హోలీ ఆడేముందు ఈ పనులు చేయండి.. చర్మం.. కళ్లపై పడకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి..