‘ గగన్‌యాన్ ‘ కోసం నలుగురు వ్యోమగాముల గుర్తింపు ‘.. ఇస్రో చైర్మన్ శివన్

| Edited By: Ram Naramaneni

Jan 01, 2020 | 4:46 PM

ప్రతిష్టాత్మకమైన ‘ గగన్‌యాన్ ‘ కోసం వ్యోమగాములకు శిక్షణ ఇచ్ఛే కార్యక్రమం ఈ నెల మూడో వారం నుంచి రష్యాలో ప్రారంభమవుతుందని ఇస్రో ప్రకటించింది. మానవ సహితమైన ఈ మిషన్ లో పాలుపంచుకునే నలుగురు వ్యోమగాములను గుర్తించినట్టు ఈ సంస్థ చీఫ్ కె. శివన్ తెలిపారు. రష్యాలో జనవరి మూడో వారం నుంచి వారికి ట్రైనింగ్ మొదలవుతుంది.. చంద్రయాన్-3, గగన్‌యాన్‌లకు సంబంధించిన పనులు ఏకకాలంలో కొనసాగుతాయి ‘ అని ఆయన వివరించారు. అయితే ఆ నలుగురు ఏస్ట్రోనట్స్ […]

 గగన్‌యాన్  కోసం నలుగురు వ్యోమగాముల గుర్తింపు .. ఇస్రో చైర్మన్ శివన్
Follow us on

ప్రతిష్టాత్మకమైన ‘ గగన్‌యాన్ ‘ కోసం వ్యోమగాములకు శిక్షణ ఇచ్ఛే కార్యక్రమం ఈ నెల మూడో వారం నుంచి రష్యాలో ప్రారంభమవుతుందని ఇస్రో ప్రకటించింది. మానవ సహితమైన ఈ మిషన్ లో పాలుపంచుకునే నలుగురు వ్యోమగాములను గుర్తించినట్టు ఈ సంస్థ చీఫ్ కె. శివన్ తెలిపారు. రష్యాలో జనవరి మూడో వారం నుంచి వారికి ట్రైనింగ్ మొదలవుతుంది.. చంద్రయాన్-3, గగన్‌యాన్‌లకు సంబంధించిన పనులు ఏకకాలంలో కొనసాగుతాయి ‘ అని ఆయన వివరించారు. అయితే ఆ నలుగురు ఏస్ట్రోనట్స్ ఎవరన్నది ఆయన తెలియజేయలేదు. చంద్రయాన్-2 మిషన్ లో విక్రమ్ లాండర్ క్రాష్ సైట్ ను గుర్తించిన చెన్నైలోని టెక్కీని ఆయన అభినందించారు. క్రాష్డ్ మోడ్యూల్ ఫోటోను రిలీజ్ చేయరాదన్నది ఇస్రో విధానమని శివన్ స్పష్టం చేశారు. వెలాసిటీ తగ్గిపోయి లాండర్ విఫలం కావడంవల్లే అది క్రాష్ అయిందని ఆయన మరోసారి చెప్పారు.

కాగా-చంద్రయాన్-3 మిషన్ ని 2021 లో చేపడతామని శివన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించిందని, ఇది  చంద్రయాన్-2 పై ఆధారపడిఉంటుందని ఆయన చెప్పారు. మూడో దశ మిషన్ పనులు సజావుగా సాగుతున్నాయన్నారు. ‘ ఈ నూతన సంవత్సరంలో కనీసం 25 స్పేస్ మిషన్స్ ను చేపట్టాలన్నది మా సంస్థ లక్ష్యం.. చంద్రయాన్-2 పై మంచి పురోగతి సాధించాం.. ఈ ప్రయోగంలో విక్రమ్ లాండర్ విజయవంతంగా దిగలేకపోయినప్పటికీ.. ఆర్బిటర్ ఇంకా పని చేస్తూనే ఉంది.. సైన్స్ డేటాను అందించేందుకు వచ్ఛేఏడేళ్ల వరకూ ఇది పని చేయనుంది ‘ అని శివన్ వివరించారు.