ఈ రోజుల్లో రాజకీయ నేతల్లో నిజాయితీ ఎక్కడుందీ అని ప్రశ్నించేవారు చాలమంది ఉంటారు. కానీ ఇప్పటికి అతిసామాన్యంగా జీవితాన్ని గడిపే నాయకులు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నేతల్లో గోపాల్ భండారీ ఒకరు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, సాధారణ జీవితాన్ని గడిపే గోపాల్ భండారీ జీవితం కూడా సామాన్యంగానే ముగిపోయింది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ద బస్సులో బెంగళూరు నుంచి మంగుళూరుకు ప్రయాణిస్తుండగా గోపాల్ భండారీకి గుండెపోటు వచ్చింది. అయితే బస్సు మంగుళూరుకు చేరుకున్నప్పటికీ ఆయన ఎంతకూ బస్ దిగకపోవడంతో డ్రైవర్ ఆయన దగ్గరకు వెళ్లి గమనించాడు . అప్పటికే భండారీ అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా డ్రైవర్ గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
గోపాల్ భండారీ కర్ణాటకలోని ఉడిపి అసెంబ్లీస్ధానం నుంచి 1999,2008 ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు దఫాలుగా పోటీచేస్తున్నా ఓటమి పాలయ్యారు.