Amit Khare: ఉత్తమ పదవిలో మాజీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి.. ప్రధాని మోడీ సలహాదారుగా అమిత్ ఖరే

|

Oct 12, 2021 | 9:14 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే‌ను నియమించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

Amit Khare: ఉత్తమ పదవిలో మాజీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి.. ప్రధాని మోడీ సలహాదారుగా అమిత్ ఖరే
Amit Khare
Follow us on

Amit Khare as PM Modi Adviser: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే‌ను నియమించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రధాన మంత్రి కార్యాలయంలో రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఈ పదవిని నిర్వహిస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 1985 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు ఐఏఎస్ అధికారి అయిన అమిత్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశారు.

కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన గత నెలలో రిటైర్డ్ అయ్యారు. ప్రధాని మోడీ నిర్దేశకత్వంలో రూపొందిన నూతన విద్యా వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించారు. జాతీయ విద్యా విధానం – 2020 రూపకర్తల్లో అమిత్ ఖరే క్రియాశీలక పాత్ర పోషించారు. డిజిటల్ మీడియా నిబంధనల విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో కీలక మార్పులు తేవడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా, మాజీ కార్యదర్శి అమర్‌జీత్ సిన్హా ప్రధాన మంత్రి కార్యాలయంలో సలహాదారుల పదవుల నుంచి ఈ ఏడాది వైదొలగిన నేపథ్యంలో అమిత్ ఖరే నియామకం జరిగింది. ఆయన అత్యంత పారదర్శకతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ, సమర్థులుగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉన్నత విద్య, పాఠశాలల శాఖకు నేతృత్వం వహించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఆయన నాయకత్వం వహించారు.

1990 సంవత్సరంలో ఉమ్మడి బీహార్ రాష్ట్ర పశు సంవర్థక శాఖలో డిఫ్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ ఖరే.

Read Also…  Nepal Bus Accident: పండుగ పూట విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 28 మంది దుర్మరణం!