
మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కాంగ్రెస్ మాజీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్. ప్రధాని మోదీ చాలా ఉదార స్వభావుడని ప్రశంసలు గుప్పించారు. గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పలు బిల్లుల చర్చ సమయంలో ఎన్నో ఆటంకాలు సృష్టించినప్పటికీ ఆయన మాత్రం సంయమనంగా ఉన్నారని అన్నారు. గులాం నబీ ఆజాద్ బుధవారం (ఏప్రిల్ 5) తన ఆత్మకథ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్డినెన్స్‌ను చించివేస్తున్నందుకు రాహుల్ గాంధీపై మన్మోహన్ సింగ్ కోపంగా ఉన్నారని.. రాజీనామా చేయాలనుకుంటున్నారని జరిగిన సంభాషణలో ఆజాద్ అన్నారు. ఆ చట్టం ఈరోజు కూడా ఉండి ఉంటే రాహుల్ గాంధీ సభ్యత్వం మిగిలి ఉండేదని ఆజాద్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలపాలన్నారు. ప్రధాని మోదీ తన పట్ల ఉదారంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏ అంశంలోనూ తాను విడిచిపెట్టలేదన్నారు. కీలక బిల్లుల విషయంలోనూ ఆయనను తాను విడిచిపెట్టలేదన్నారు. కొన్ని బిల్లులు ఆమోదం పొందకుండా పూర్తిగా అడ్డుకున్నట్లుగా గుర్తు చేసుకున్నారు. ఇంత చేసినా ప్రధాని మోదీ ఎటువంటి ప్రతీకార చర్యలకు దిగకుండా ఓ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించార అన్నారు.
ఇక నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలు చేసిన సేవలు, ప్రజల్లో వారికున్న ఛరిష్మాను గుర్తుచేసుకున్న ఆజాద్.. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజల్లో అటువంటి పట్టు లేదన్నారు. అయితే, పార్టీ అధిష్ఠానంతో అభిప్రాయ భేదాలున్నప్పటికీ అంతకుముందున్న కాంగ్రెస్ అధినాయకత్వం, పార్టీ సిద్ధాంతంపై మాత్రం ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని ఉద్ఘాటించారు. రాహుల్ కారణంగానే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నారని ఆయన అన్నారు.
రాహుల్ ముందు మన్మోహన్ సింగ్ తలవంచక తప్పదని, అప్పుడు మంత్రివర్గం బలహీనంగా ఉందన్నారు. ఏదో ఒక సమయంలో మనకు వ్యతిరేకంగా ప్రయోగించేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చామని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఆజాద్ అన్నారు. ఎందుకంటే ఒక్కోసారి మరో పార్టీ కూడా అధికారంలో ఉండొచ్చు. ఆ సమయంలో అతను దానిని చించివేసాడు. ఆ సమయంలో మంత్రివర్గం బలహీనంగా ఉంది. అప్పటి మంత్రివర్గం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది.
నీ గోడలకు నువ్వే రంద్రాలు వేశావని, ఇప్పుడు ఎవరైనా పీక్కుతింటే ఏంటి సందడి అని ఆజాద్ కవితాత్మకంగా అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారని ఆజాద్ అన్నారు. రాహుల్ గాంధీతో పాటు నేతలు సూరత్ కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా ఆజాద్ ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ వల్లే తాను కాంగ్రెస్‌ను వీడానని చెప్పారు. ఆజాద్ స్వయంగా యూపీఏ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం