Former CM Sister in Law: మాజీ సీఎంకు మరదలు.. 34 ఏళ్ళు సైన్స్ టీచర్‌గా ఉద్యోగం.. ఇప్పుడు ఫుట్ పాత్‌పై భిక్షాటన..

Former CM Sister in Law: కాలం కలసి రాకపోతే..  ఓడలు బండ్లు అవుతాయి. దేశాన్ని ఏలే రాజులు సైతం సేవకులుగా మారిపోతారు. ఇక పేదరికం, దారిద్య్రం కోరల్లో చిక్కుంటే.. బతకడం కోసం.. తాను చదువుకున్న విషయం మర్చిపోతారు... ఆత్మాభిమానాన్ని..

Former CM Sister in Law: మాజీ సీఎంకు మరదలు.. 34 ఏళ్ళు సైన్స్ టీచర్‌గా ఉద్యోగం.. ఇప్పుడు ఫుట్ పాత్‌పై భిక్షాటన..
Bengal Cm Sister In Law

Updated on: Sep 10, 2021 | 9:37 PM

Former CM Sister in Law: కాలం కలసి రాకపోతే..  ఓడలు బండ్లు అవుతాయి. దేశాన్ని ఏలే రాజులు సైతం సేవకులుగా మారిపోతారు. ఇక పేదరికం, దారిద్య్రం కోరల్లో చిక్కుంటే.. బతకడం కోసం.. తాను చదువుకున్న విషయం మర్చిపోతారు… ఆత్మాభిమానాన్ని సైతం పక్కన పెట్టి.. బిక్షాటన చేయడానికి కూడా సిద్ధపడతారు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఓ వృద్ధురాలు.. ఉన్నత విద్యాభ్యాసించింది.. అంతేకాదు.. మంది క్రీడాకారిణి కూడా.. ఇక ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేసి.. ఎంతోమంది భావిభారత పౌరులను తీర్చి దిద్దింది.. ఇక ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆమె బతకడం కోసం యాచకురాలిగా మారింది. ఎవరూ నమ్మలేని ఈ నిజం..ఆమె పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ.. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లా బారా బజార్ ప్రాంతంలో ఫుట్ పాత్ లపై భిక్షాటన చేసే ఇరా బసు అనే వృద్ధురాలి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె ఎందుకు యాచకురాలిగా మారిందో ఎవరికీ అర్ధంకావడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఇరా బసు వైరాలజీలో పీహెచ్ డీ చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడే ఆ విద్యాధికురాల.. అంతేకాదు చదుకునే సమయంలో మంచి క్రీడాకారిణి.. క్రికెట్, టేబుల్ టెన్నిస్ లోనూ మంచి ప్రతిభ కనబరిచారు.

ఇక ఇరా బసు చదువుకునే సమయంలో రాష్ట్రస్థాయిలో క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడారు.  అనంతరం సైన్ టీచర్ గా ప్రియాంత్ బాలికల హై స్కూల్ లో  34 ఏళ్ళు ఉద్యోగం చేశారు. అనంతరం 2009 లో ఉద్యోగం నుంచి పదవీవిరమణ అయ్యారు. అక్కడే ఇరా బసు జీవితం మారిందని అంటున్నారు. రిటైర్ అయిన తర్వాత ఇరా బసు జీవితం దుర్భరంగా మారింది. దీంతో ప్రస్తుతం ఆమె పుట్ పాత్ పై బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నారు.

ఇదే విషయంపై ఆమె పనిచేసిన స్కూల్ ప్రిన్సిపల్ స్పందిస్తూ… ఇరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని.. ఆమె పింఛన్ కోసం అప్లికేషన్ పెడితే.. నెలకు కొంత మొత్తం వస్తుందని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఇరా తన పెన్షన్ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు.

అయితే ఇరా బసు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్యకు స్వయానా మరదలు.  బుద్ధదేవ్ భట్టాచార్య  మీరా కు స్వయాన తోడబుట్టిన చెల్లెలు. మాజీ సీఎం భార్య చెల్లెలు ఈ స్థితిలో ఉండడాన్ని బారా బజార్ లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇరాబసు కి కొందరు స్థానికులు సత్కారం చేశారు.  ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న అధికారులు వైద్య చికిత్స కోసం కోల్ కతా తరలించారు.

తన పరిస్థితిపై ఇరా బసు స్పందిస్తూ.. తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్న సమయంలో.. ఎటువంటి ప్రయోజనాలు పొందలేదని.. ఇక ఇప్పుడు కూడా తాను గొప్పదానిని అనుకోవడం లేదని స్పష్టం.. చేశారు.

Also Read: మన చరిత్ర చెప్పని యుద్ధం.. ప్రాన్స్ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు భోదిస్తున్న వైనం.. 10 వేల మంది ఆఫ్ఘన్ల ముఠాను మట్టుబెట్టిన 21 మంది సిక్కు యోధుల సాహసం