ఎవరినీ కించపరచాలనుకోలేదు ః కమల్‌నాథ్‌ వివరణ

|

Oct 20, 2020 | 11:19 AM

ఓవైపు బీజేపీ, మరోవైపు మహిళా సంఘాలు, ఇంకోవైపు జాతీయ మహిళా కమిషన్‌...ఇలా అన్ని వైపుల నుంచి నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ దారికొచ్చారు..

ఎవరినీ కించపరచాలనుకోలేదు ః కమల్‌నాథ్‌ వివరణ
Follow us on

ఓవైపు బీజేపీ, మరోవైపు మహిళా సంఘాలు, ఇంకోవైపు జాతీయ మహిళా కమిషన్‌…ఇలా అన్ని వైపుల నుంచి నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ దారికొచ్చారు.. అబ్బే .. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని వివరణ ఇచ్చుకున్నారు.. అభ్యర్థి పేరు సడన్‌గా గుర్తు రాకపోవడంతో ఐటమ్‌ అన్న పదం వాడానని చెప్పుకొచ్చారు.. చేతిలో ఉన్న పత్రాన్ని చూపుతూ ఇందులో ఐటమ్‌ నెంబర్‌ వన్‌, ఐటమ్‌ నెంబర్‌ టూ అని లేవా ఏమిటి? అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.. ఐటమ్‌ అంటే అవమానించినట్టు ఎలా అవుతుందని అమాయకంగా ప్రశ్నించారు.. ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని అంత రచ్చ చేస్తుందని అన్నారు కమల్‌నాథ్‌.. గ్వాలియర్‌లోని దాబ్రా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే ఈ సీనియర్‌ నేత నోరు అదుపుతప్పింది.. బీజేపీ అభ్యర్థిని ఐటమ్‌ అంటూ సంబోధించారు కమల్‌నాథ్‌..