Viral video: చీతాలకు నీటి సాయం చేశాడని అధికారులు ఏం చేశారో చూడండి!

వేసవి వచ్చిందంటే చాలు మండే ఎండలకు నోరు అరుకుపోతూ ఉంటుంది. నిమిషానికోసారి నీళ్లు కావాలనిపిస్తుంది. మనకంటే నీరు అందుబాటులో ఉంటాయి ఓకే..మరి వణ్య ప్రాణాలు పరిస్థితి ఏంటి. ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు..ఎక్కడా చుక్క నీరు ఉండదు..కుంటలు, చెరువులు ఎండి పోతాయి. దీంతో వణ్య ప్రాణులకు నీరు దొరకక తెగ అల్లాడిపోతుంటాయి. ఇలాంటప్పుడు కొందరు ప్రకృతి ప్రేమికులు వాటి సంరక్షణకోసం, ఇళ్లపై, ఇంటి బయట, కొన్ని గిన్నెల వంటివి పెట్టి, ఆహారం, నీరు పోస్తుంటారు. అయితే మనం ఈ కింద చూస్తున్న వీడియో కూడా అలాంటిదే..కానీ ఇక్కడ మనోడు చేసింది చిన్న సాహసం కాదు..ఏకంగా ప్రాణాలకు తెగించి..దాహంతో ఉన్న ఓ చిరుత ఫ్యామిలీకి నీళ్లు అందించాడు. అయితే మనోడు చేసిన ఈ సాహసం తన ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఇంత మంచి పనిచేస్తే ఉద్యోగం పోవడం ఏంటి అనుకుంటున్నారా..సరే చూద్దాం పదండి.

Viral video:  చీతాలకు నీటి సాయం చేశాడని అధికారులు ఏం చేశారో చూడండి!
Viral Video

Updated on: Apr 06, 2025 | 5:58 PM

Madhya pradesh :మధ్యప్రదేశ్‌లోని అటవీశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ గుర్జార్‌ అనే వ్యక్తి..కూనో నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ చెట్టుకింద సేద తీరుతున్న చిరుత ఫ్యామిలీని గమనించాడు. వాటి దగ్గరకు వెళ్లి ఒక పాత్రలో క్యాన్‌తో నీటిని నింపాడు. వచ్చి తాగండి అని వాటిని పిలిచాడు. దాహంతో ఉన్న జ్వాలా అనే చిరుతతో పాటు దాని నాలుగు పిల్లలు  ఆపాత్రలోని నీటిని తాగి దాహం తీర్చుకున్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సత్య నారాయణపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లు స్పందన ఇలా ఉంటే.. ఆ డ్రైవర్‌ తీరుపై ఉన్నతాధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.

గత కొన్నిరోజుల క్రితం కూనో నేషనల్‌ పార్క్‌ నుంచి తప్పించుకున్న ఈ జ్వాలా అనే చిరుత దాని పిల్లలు సమీపంలోని గ్రామంలో చొరబడి 6 మేకల చంపితిన్నట్టు తెలుస్తోంది. దీంతో గ్రామస్తులు ఈ చిరుతపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అది  అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ఇది జరిగిన వారం రోజుల తర్వాత చిరుతలకు ఓ వ్యక్తి నీరు అందిస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై గ్రామస్తులు స్పందించారు. ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థలో భాగం అయినప్పటికీ  క్రూర మృగాలుకు దగ్గరగా వెళ్లడం ఎంతో ప్రమాదకరమణి అధికారులు చెబుతున్నారు. చిరుతలు అడవి జంతువులని, వాటిని పెంపుడు జంతువుల్లాగా చూడకూడదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..