Aadhar Card: మీ ఆధార్‌తో ఎవరైనా సిమ్‌ తీసుకున్నారని అనుమానం ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి..

|

Nov 20, 2022 | 8:09 PM

బ్యాంకు ఖాతా నుంచి సిమ్‌ కార్డ్‌ వరకు ఏ అవసరానికైనా ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఎన్నో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం పథకాల నుంచి మొదలు..

Aadhar Card: మీ ఆధార్‌తో ఎవరైనా సిమ్‌ తీసుకున్నారని అనుమానం ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి..
Aadhar Card
Follow us on

బ్యాంకు ఖాతా నుంచి సిమ్‌ కార్డ్‌ వరకు ఏ అవసరానికైనా ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఎన్నో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం పథకాల నుంచి మొదలు చిన్న చిన్న అవసరాలకు సైతం ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఆధార్‌ కార్డులతో దొంగ సిమ్‌లను తీసుకుంటున్న ఇటీవల వార్తా కథనాలు వస్తున్నాయి.

కొందరు నేరస్థులు ఇతరుల ఆధార్డ్‌ కార్డుతో అక్రమంగా సిమ్‌కార్డులను తీసుకొని వాటిని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. మీ ఆధార్‌ కార్డుతో ఏవైనా సిమ్‌ కార్డులు తీసుకున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ఆప్షన్‌ను అందించింది. టాఫ్‌-కాప్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇంతకీ ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

* ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేసి ‘రిక్వెస్ట్‌ ఓటీపీ’ ఆప్షన్‌ మీద నొక్కాలి.

* ఓటీపీని ఎంటర్‌ చేసి ‘వాలిడేట్‌’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మీ ఆధార్‌ సంఖ్యపై తీసుకున్న మొబైల్‌ నంబర్లు/సిమ్‌ల వివరాలన్నీ కనిపిస్తాయి.

* వీటిలో మీకు సంబంధించిన నెంబర్లు లేకపోతే అక్కడే రిపోర్ట్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..