విమాన ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్.. మరింత ప్రియంగా దేశీయ విమాన ప్రయాణం..

|

May 29, 2021 | 8:41 AM

Air Fares Hiked: విమాన ప్రయాణీకులకు షాక్ ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది... దేశీయ విమాన..

విమాన ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్.. మరింత ప్రియంగా దేశీయ విమాన ప్రయాణం..
Plane
Follow us on

Air Fares Hiked: విమాన ప్రయాణీకులకు షాక్ ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసుల టికెట్ల ధరలను 13-16 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. అయితే ఎగువ పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని కేంద్రం పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన విమానయాన సంస్థలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితిని రూ. 2,300 నుంచి రూ .2,600కు పెరగగా.. 40 నిమిషాల నుండి 60 నిమిషాల మధ్య విమాన ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ గతంలో రూ .2,900 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ .3,300కు పెంచారు. అలాగే 60-90 నిమిషాల ప్రయాణానికి రూ. 4 వేలు, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ. 4700, 120-150 నిమిషాల ప్రయాణానికి రూ. 6100, 180-120 నిమిషాల ప్రయాణానికి రూ. 8700 దిగువ పరిమితి ఛార్జీలుగా ఉండనున్నాయి.

కాగా, కోవిడ్ నేపధ్యంలో జూన్ 1వ తేదీ నుంచి 50 శాతం విమానాలు మాత్రమే నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సంస్థలు 80 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!