School Holidays: భారీ వర్షాలు.. 10 జిల్లాల్లో పాఠశాలలు బంద్‌.. ఆ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

School Holidays: రాబోయే మూడు రోజులు దక్షిణ, ఆగ్నేయ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఆగస్టు 22 -29 మధ్య పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్‌లో వర్షాకాలం..

School Holidays: భారీ వర్షాలు.. 10 జిల్లాల్లో పాఠశాలలు బంద్‌.. ఆ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Updated on: Aug 23, 2025 | 10:55 AM

School Holidays: దేశంలో వర్షాల దంచి కొడుతున్నాయి. ఇటు ఏపీ, తెలంగాణలో గత రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురిసి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలగే రాజస్థాన్‌లో రుతుపవనాలు వేగవంతమయ్యాయి. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక జిల్లాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. కోట, బుండి, బరాన్, ఝలావర్, టోంక్, చిత్తోర్‌గఢ్, సవాయి మాధోపూర్‌తో సహా అనేక జిల్లాల్లో వరదల వంటి పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాజస్థాన్‌లో రుతుపవనాల బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యకలాపాల కోసం NDRF, పోలీసు బృందాలను మోహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఐదేళ్ల కిందట బ్యాన్‌ అయిన టిక్‌టాక్‌ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి టోంక్, కోటా, సవాయి మాధోపూర్, బుండి, దౌసా జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సహాయ చర్యలతో పాటు సహాయక చర్యలను సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ప్రభావితమైన పంటలపై ప్రత్యేక గిర్దావారీ చేపడతామని ఆయన అన్నారు. దీనితో పాటు ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని త్వరగా అంచనా వేయడం ద్వారా ఉపశమనం అందించనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

10 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు:

రాబోయే మూడు రోజులు దక్షిణ, ఆగ్నేయ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఆగస్టు 22 -29 మధ్య పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్‌లో వర్షాకాలం పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం సవాయి మాధోపూర్, టోంక్, కోట, బరాన్, బుండి, ఝలావర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, దుంగార్‌పూర్, బన్స్వారా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు ఈరోజు సెలవు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిక జారీ చేయబడింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు తెరవకూడదని విద్యాసంస్థలకు సూచించింది ప్రభుత్వం. వర్షాలు ఇలాగే కొనసాగితే మరిన్ని సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Viral Video: నాతో పెట్టుకుంటే అంతే సంగతి.. పులిపై కుక్క ఎదురుదాడి.. 300 మీటర్లు లాకెళ్లిన శునకం.. వీడియో వైరల్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి