క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు కనీవినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ధర్మశాలతో బాటు దీనికి సుమారు 58 కి..మీ.దూరంలోని కాంగ్రా జిల్లాలో భాగ్సు నాగ్ ఏరియా, మెక్ లియోడ్ గంజ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటి ప్రవాహ వేగానికి ఈ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన కార్లు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఒక్కో కారు ఈ వేగానికి వెనుకకు వస్తూ అంతకుముందే నిలిచిపోయిన వాహనాలను ఢీ కొని నిలిచిపోతోంది. అతి పెద్ద వాహనాలు కూడా కొట్టుకుపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటివరకు టూరిస్టులతో కళకళలాడిన ధర్మశాల ఇప్పుడు బీభత్సంగా కనబడుతోంది. కొన్ని చోట్ల ఇళ్ళు, భవనాలు, హోటళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. ఎత్తయిన ఇళ్ల బాల్కనీల నుంచి కొందరు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నిన్నటి వరకు ఉష్ణోగ్రత కారణంగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేద దీరుతున్నప్పటికీ ఈ హఠాత్పరిణామం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని వైపుల నుంచి వస్తున్న నీటి ప్రవాహ వేగాన్ని చూసి వారు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా హిల్ స్టేషన్లలో క్లౌడ్ బరస్ట్ లు ఇంతటి భయానక పరిస్థితిని సృష్టిస్తుంటాయి. ఏ మాత్రం ఊహించలేని ఇవి మెరుపు వరదలకు కారణమవుతుంటాయి. అపార నష్టాన్ని కలుగజేస్తుంటాయి.
#WATCH Flash flood in Bhagsu Nag, Dharamshala due to heavy rainfall. #HimachalPradesh
(Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) pic.twitter.com/SaFjg1MTl4— ANI (@ANI) July 12, 2021
Cloudburst in Bhagsunath, Kangra district of Himachal Pradesh. @ndtv pic.twitter.com/a7o7JnHBRo
— Mohammad Ghazali (@ghazalimohammad) July 12, 2021
Dharamshala (Hp): Flash Flood In Bhagsu Nag #Dharamshala Due To Heavy Rainfall In #Mcleodganj#Flood #rains pic.twitter.com/pjdKwqxuxA
— Amit.sahu (@amitsahujourno) July 12, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ లేఖ..