Indian Army: దేశ చరిత్రలో కీలక పరిణామం.. ఆర్మీ కీలక విభాగంలోకి ఐదుగురు వనితలు..

|

Apr 30, 2023 | 6:05 AM

Regiment of Artillery: దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఆర్మీ తొలిసారి మహిళా అధికారులకు ఎంట్రీ ఇచ్చింది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అడకామీలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు. భారత సైన్యంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని చెప్పుకొస్తున్నాయి ఆర్మీ వర్గాలు.

Indian Army: దేశ చరిత్రలో కీలక పరిణామం.. ఆర్మీ కీలక విభాగంలోకి ఐదుగురు వనితలు..
Artillery Regiment 1
Follow us on

Regiment of Artillery: దేశ చరిత్రలో ఆర్మీ కీలక విభాగంలోకి ఐదుగురు వనితలు అడుగు పెట్టారు. ఆర్మీ ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకుంది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అడకామీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారు.

ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురిని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్‌ సరిహద్దుకు సమీపంలో ‘సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో’ నియమించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో మహిళా అధికారులను నియమించడం భారత సైన్యంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి.. ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్టిలరీ యూనిట్లలో మహిళా అధికారులను నియమించినట్లు జనవరిలో ప్రకటించారు.

ఆ మేరకు కేంద్రానికి సైన్యం ప్రతిపాదనలు పంపగా.. ఆమోదం తెలిపింది. దాంతో తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఐదుగురు మహిళా అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక.. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో పాసింగ్‌ పరేడ్‌ జరిగింది. 189 క్యాడెట్స్‌ శిక్షణ పొందగా.. అందులో భూటాన్‌కు చెందిన 29 మంది క్యాడెట్స్‌ ఉన్నారు. ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను బంగ్లాదేశ్‌ ఆర్మీ జనరల్‌ ఎస్‌ఎం షఫీయుద్దీన్‌ అహ్మద్‌ సమీక్షించి, క్యాడెట్స్‌ను అభినందించారు.

ఇండియన్‌ ఆర్మీలో ఆర్టిలరీ రెజిమెంట్‌ అనేది రెండో అతిపెద్ద విభాగం. క్షిపణులు, తుపాకులు, మోర్టార్‌లు, రాకెట్‌ లాంచర్లు, మానవ రహిత వైమానికి వాహనాలతోపాటు ఆర్టిలరీ మందుగుండు సామాగ్రి ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..