Viral: పాడుబడ్డ ఇంటికి డైలీ రాత్రి వచ్చిపోతున్న గుర్తుతెలియని వ్యక్తులు.. పోలీసులు సోదాలు చేయగా

|

Mar 31, 2023 | 6:26 PM

ఆ ఇంట్లో నివసించిన వారికి రియల్ ఎస్టేట్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు.

Viral: పాడుబడ్డ ఇంటికి డైలీ రాత్రి వచ్చిపోతున్న గుర్తుతెలియని వ్యక్తులు.. పోలీసులు సోదాలు చేయగా
Old House (Representative image)
Follow us on

కేరళలోని కాసర్‌గోడ్‌లోని ఎవరూ నివాసం ఉండని.. ఓ పాడుబడ్డ ఇంట్లో కోటి రూపాయల విలువైన పాత రూ.1,000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసర్‌గోడ్ జిల్లా ముండ్యతటుక్క గ్రామానికి చెందిన షఫీ ఇంట్లో ఈ కరెన్సీ నోట్లతో కూడిన ఐదు బస్తాలు లభ్యమయ్యాయి. బత్తియడుక్క పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంటి యజమానికి రియల్ ఎస్టేట్ మాఫియాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటికి తరచూ వస్తుండటాన్ని ఆ ప్రాంత వాసులు గమనించారు. వారు అందించిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బత్తియడుక్క సబ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కరెన్సీ నోట్ల కట్టలతో పాటు రూ.1000 కరెన్సీ నోట్ల సైజులో కత్తిరించిన సాధారణ పేపర్ కట్టలు కూడా దొరికాయి. దొంగ నోట్ల తయారికి వాటిని వినియోగించాలనుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బును చూపించి కస్టమరలను మోసం చేసేందుకు ఈ నోట్లను ఉపయోగించారా అన్న అంశంపై కూడా విచారణ జరుపుతున్నారు. నగదు స్వాధీనం చేసుకున్న ఇంటి పక్కన నివసిస్తున్న వారిని అడిగి పోలీసులు పలు వివరాలు తెలుసుకున్నారు. చాలా కాలంగా ఇల్లు ఖాళీగా ఉందని వారు చెప్పుకొచ్చారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఇంటికి  రాత్రి వేళల్లో వచ్చిపోవడం జరగడంతో సమాచారం ఇచ్చామని తెలిపారు.

 ఉగ్రవాదం, నకిలీ నోట్లపై పోరు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1,000,  రూ.500 కరెన్సీ నోట్లను నవంబర్ 8, 2016న రద్దు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..