Dengue Deaths: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. మంచాన పడ్డ దేశ రాజధాని..

కరోనాలో మాత్రమే కాదూ.. డెంగ్యూలోనూ కొత్త మ్యూటెంట్లు పుట్టుకొస్తున్నాయి. చూస్తుండగానే శక్తివంతంగా మారి మనిషి ప్రాణాలు తోడేస్తున్నాయి. డెంగ్యూ దోమ కుట్టిందా..

Dengue Deaths: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. మంచాన పడ్డ దేశ రాజధాని..
Check For Dengue With Goat Milk A Liter Of Milk Costs Rs. 400 Video

Updated on: Nov 01, 2021 | 2:05 PM

కరోనాలో మాత్రమే కాదూ.. డెంగ్యూలోనూ కొత్త మ్యూటెంట్లు పుట్టుకొస్తున్నాయి. చూస్తుండగానే శక్తివంతంగా మారి మనిషి ప్రాణాలు తోడేస్తున్నాయి. డెంగ్యూ దోమ కుట్టిందా ఇక ఐసీయూలోకే అన్నట్టుగా మారింది పరిస్థితి. డేంజర్ బెల్స్ మోగిస్తోంది డెంగ్యూ. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ వార్నింగ్స్‌..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా పంజా విసురుతుందంటూ హెచ్చరికలు..పండుగల వేళ ప్రజలను టెన్షన్‌ పెడుతున్నాయి. ఐతే ఈ మహమ్మారి చాలదన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో డెంగ్యూ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ ధాటికి ఆరుగురు మృతి చెందారు. ఇదే మొదటిసారి.

ఢిల్లీలో డెంగ్యూ విజృంభణతో కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ఢిల్లీలో ఈ ఏడాదిలో మొత్తం వెయ్యికి పైగా డెంగీ కేసులు వెలుగుచూశాయి.

అయితే గడిచిన 23 రోజుల్లోనే 665 కేసులు బయటపడ్డాయి. ఇందులో దాదాపు 280 కేసులు గత వారమే నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో బెడ్స్‌ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఢిల్లీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయనుకునేలోపే..డెంగ్యూ పంజా విసరడం తలనొప్పిగా మారింది.

ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..

LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..