వీళ్లు మామూలు బ్యాచ్ కాదు, అసోం సీఎం సంతకం ఫోర్జరీ.
వీళ్లు మామూలు బ్యాచ్ లా లేరు. ఆ ఇంట్లో.. ఈ షాపులో కన్నమేసి ఎందుకు జనాన్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం అనుకున్నారో ఏమో.. ఏకంగా తమ ప్రియతమ ముఖ్యమంత్రి ఖజానాకే ఎసరుపెట్టారు. అసోం సీఎం సంతకాన్ని..
వీళ్లు మామూలు బ్యాచ్ లా లేరు. ఆ ఇంట్లో.. ఈ షాపులో కన్నమేసి ఎందుకు జనాన్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం అనుకున్నారో ఏమో.. ఏకంగా తమ ప్రియతమ ముఖ్యమంత్రి ఖజానాకే ఎసరుపెట్టారు. అసోం సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎంచక్కా సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్మును దర్జాగా తీసేసుకున్నారు. ఈ ఘరానా మోసగాళ్లను మంగళవారం అసోం పోలీసులు యూపీలోని గోరఖ్ పూర్ లో అరెస్టు చేశారు. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని రోజులుగా నిధులు విత్‌డ్రా అవుతున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధులను కాజేస్తున్నట్లు నిర్ధారించుకుని గుట్టుచప్పుడు కాకుండా విచారణకు ఆదేశించారు.
పోలీసు సూపరింటెండెంట్ రోసీ కలిత తో స్పెషల్ టీం ఏర్పాటు చేసి 15 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ ఆగస్టు 12న కేసు నమోదు చేసింది. నిందితులు ఫేక్ చెక్కుల ద్వారా హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు బ్యాంకుల్లో డబ్బు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. రోసీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల పోలీసుల బృందం గోరఖ్‌పూర్‌తో పాటు బస్తీ ప్రాంతాల్లో గాలించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. విచిత్రం ఏంటంటే..గతంలో పలు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు ఈ ముఠా సభ్యులు చెప్పడం కొసమెరుపు.