Undressing for Rs 50 crore: దుస్తులు విప్పితే రూ. 50 కోట్లు వస్తాయి.. పూజల పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసిన మాయగాళ్లు.. చివరికి..

|

Mar 01, 2021 | 10:24 AM

Undressing for Rs 50 crore: నగ్నంగా పూజలు చేయడం ద్వారా రూ. 50 కోట్ల డబ్బులు వస్తాయని, ఆ కారణంగా దుస్తులు విప్పి పూజా కార్యక్రమాల్లో..

Undressing for Rs 50 crore: దుస్తులు విప్పితే రూ. 50 కోట్లు వస్తాయి.. పూజల పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసిన మాయగాళ్లు.. చివరికి..
Follow us on

Undressing for Rs 50 crore: నగ్నంగా పూజలు చేయడం ద్వారా రూ. 50 కోట్ల డబ్బులు వస్తాయని, ఆ కారణంగా దుస్తులు విప్పి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఓ మైనర్ బాలికపై ఒత్తిడిని ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నిందితులపై క్షుద్రపూజల చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి మైనర్ బాలికను కలిసి తాను చెప్పినట్లు చేస్తే క్షణాల్లో ధనవంతురాలు అవుతావని, రూ. 50 కోట్లు డబ్బు వర్షం కురుస్తుందంటూ నమ్మబలికాడు. అందుకోసం కొన్ని పూజలు చేయాలని పేర్కొన్నారు. అది నమ్మిన బాలిక.. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించింది. అయితే, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో బాలిక దస్తులు విప్పాలని సదరు వ్యక్తి చెప్పాడు. దాంతో పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక ససేమిరా అంది. కానీ, డబ్బులు కావాలంటే దుస్తులు విప్పాల్సిందే అంటూ సదరు వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో బాలిక వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటన వెనుక విక్కీ గణేష్ ఖాప్రే (20), దినేష్ మహాదేవ్ నిఖారే (25), రామకృష్ణ దాదాజీ మస్కర్ (41), వినోద్ జయరామ్ మస్రం (42), డిఆర్ అలియాస్ సోపాన్ హరిభావు కుమ్రే (35) ప్రధానంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులపై అసాంఘీక కార్యక్రమాలు, క్షుద్రపూజలు, లైంగిక నేరం, పోక్సో చట్టం, 354 (ఐపిసి) ఎ), 354 (డి) కింద కేసులు నమోదు చేశారు.

Also read:

PM Modi takes Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?

Golden Globes 2021: లావిష్ గా గోల్డెన్ గ్లోబ్ 2021 వేడుక, ది క్రౌన్ లో డయానా పాత్రకు ఎమ్మా కోరిన్ ను వరించిన ఉత్తమ నటి అవార్డ్