తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది.. సీనియర్‌ న్యాయవాది వద్ద సహాయకురాలిగా ఉంటూ న్యాయవాది వృత్తిలోకి..

సమాజంలో అందరితో సమానంగా జీవించే హక్కులు సాధించుకున్న ట్రాన్స్‌జెండర్లు సమాజంలో మరింతగా రాణించేందుకు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తొలిసారిగా ..

తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది.. సీనియర్‌ న్యాయవాది వద్ద సహాయకురాలిగా ఉంటూ న్యాయవాది వృత్తిలోకి..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2021 | 9:59 PM

సమాజంలో అందరితో సమానంగా జీవించే హక్కులు సాధించుకున్న ట్రాన్స్‌జెండర్లు సమాజంలో మరింతగా రాణించేందుకు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది వృత్తిలో అడుగుపెట్టారు. మైసూర్‌లోని జయనగర నివాసి అయిన శిశకుమార్‌ అలియాస్‌ శశి ఒక సీనియర్‌ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు.

14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న ఈయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూర్‌లోని అశోకపురంలో ఉన్న సిద్దార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన శశి.. మైసూర్‌ సైన్స్‌ (పీసీఎంబీ) విద్యనభ్యసించారు. ఆ తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్‌ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కాలేజీలో చేరి మూడేళ్లలో కోర్సు పూర్తి చేశారు.

అయితే న్యాయవాది వృత్తిలో అడుగుపెట్టిన శశి.. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. ఎంతో మంది అవహేళన చేసినా ఉన్నత విద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో ముందుకెళ్లానని పేర్కొన్నారు. అలాగే ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేక ఇళ్లల్లో పని చేశానని చెప్పారు. అలాగే తోటి విద్యార్థుల వద్ద కూడా ఎన్నో అవమానాలకు గురయ్యానని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకువచ్చిన సందర్భంగాలున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైద్యురాలు డాక్టర్‌ జే. రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకరించారని అన్నారు.

Also Read: Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన మెట్రో ఛార్జీలు.. టికెట్‌పై రూ.20 తగ్గింపు